MESSI: మెస్సీ రాక కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్

అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 13న మెస్సీ రాకకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియంకి మెస్సీ గోట్ టూర్ -2025 ప్రమోటర్ల బృందం చేరుకుంది. GOAT టూర్ ఇండియా చీఫ్ పార్వతి రెడ్డి, చీఫ్ ప్రమోటర్ దత్తా, మెస్సీ అంతర్జాతీయ టూర్ సలహాదారు, వ్యక్తిగత మేనేజర్ క్రిస్టోఫర్ ఫ్లాన్నరీ, పాబ్లో నెగ్రేతో పాటు తదితరులు స్టేడయానికి వచ్చారు. సమన్వయ కమిటీలో భాగమైన రోహిన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెస్సీ ధరించే జెర్సీలను ఆవిష్కరించారు. గోట్ టూర్ -2025 లో భాగంగా మెస్సీ భారత్‌లో అడుగుపెట్టనున్నారు. అందులో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ షో నిర్వహిస్తారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ సైతం చేశారు. ఆర్ఆర్ 9 జెర్సీతో సీఎం బరిలోకి దిగనున్నారు. ఫుట్‌బాల్ అంటే సీఎంకు ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.
మెస్సీని కలవడం ఎలా..
హైదరాబాద్‌లో మెస్సీ ఈవెంట్‌కు టికెట్లు విడుదలయ్యాయి. బుకింగ్ ప్లాట్‌ఫామ్, District App ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ. 1,250 నుంచి రూ.13,500 వరకు ఉన్నాయి. శనివారం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి మెస్సీ సందడి చేయనున్నాడు. హైదరాబాద్‌లో జరిగే GOAT టూర్‌కు కంటెంట్ సిద్ధమవుతోంది. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఈవెంట్ కోసం ప్రభుత్వం పక్కా ప్లానింగ్ చేస్తోంది.
మెస్సీతో రేవంత్ మ్యాచ్
హైదరాబాద్ రానున్న మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నారు. ఇందుకోసం నిన్న రాత్రి ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఫుట్‌బాల్ గ్రౌండ్లో గంటపాటు ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోజంతా కార్యక్రమాలు ముగించుకుని రాత్రి ఫుట్ బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్ లోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. యువతతో కలిసి ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. సుమారు గంటపాటు ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. మెస్సీతో కలిసి కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా హైదరాబాద్ రానున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రకటించారు. మెస్సీతో కలిసి కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కూడా ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారని తెలిపారు. దిగ్గజ ఆటగాళ్లను చూసేందుకు ఇది మంచి అవకాశామని పేర్కొన్నారు.
అర్జెంటీనా ఆటగాడు మెస్సీ అంటే చాలు ఫుట్‌బాల్‌ను అభిమానించే వారంతా ఎంతగానో ఇష్టపడతారు. అలాంటి మెస్సీ ఈనెల 13న హైదరాబాద్ రానున్నారు. భారత పర్యటనలో భాగంగా నగరానికి రానున్న మెస్సీ.. సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీమ్‌తో, రేవంత్ రెడ్డి టీమ్ ఫ్రెండ్లీ ఫుట్‌బాట్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తనకు ఇష్టమైన ఫుట్‌బాల్ గేమ్‌లో కసరత్తు మొదలుపెట్టారు. రాత్రిపూట వీలుచూసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

