Lionel Messi: 2026 వరల్డ్‌కప్‌లో ఆడనున్న మెస్సీ..!

Lionel Messi: 2026 వరల్డ్‌కప్‌లో ఆడనున్న మెస్సీ..!
దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా 1994లో తన చివరి వరల్డ్ కప్‌లో బరిలో దిగిన అర్జెంటీనా జెర్సీతో ఫోటో దిగి పోస్ట్ చేశాడు. దీంతో మెస్సీ వచ్చే వరల్డ్‌కప్‌లో ఆడొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Lionel Messi: ఫుట్‌బాల్ మేటి ఆటగాడు లియోనల్ మెస్సీ 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ గెలిచి తన జీవితకాల ఆశయం, అర్జెంటీనా ప్రజల కలను తీర్చాడు. కెరీర్‌లో అర్జెంటీనా జట్టు తరపున, క్లబ్‌ల తరఫున ఆడుతూ దాదాపు అన్ని ట్రోఫీలను గెలిచాడు. కానీ వరల్డ్‌కప్ మాత్రం అందని ద్రాక్షగా ఉంటూ ఊరిస్తూ వచ్చింది. 2022లో ఖతార్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై గెలిచి దేశానికి కప్ అందించాడు.

అయితే 2026లో జరగనున్న వచ్చే వరల్డ్‌కప్‌లో మెస్సీ పాల్గొంటాడా లేదా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.."అదే చివరి వరల్డ్‌కప్‌. పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదు, నేను చూస్తాను. కానీ సూత్రప్రాయంగా, నేను తర్వాత ప్రపంచ కప్‌కు వెళ్లను" అని స్పష్టం చేశాడు.

కానీ నిన్న సోషల్ మీడియాలో దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా 1994లో తన చివరి వరల్డ్ కప్‌లో బరిలో దిగిన అర్జెంటీనా జెర్సీతో ఫోటో దిగి పోస్ట్ చేశాడు. దీంతో మెస్సీ వచ్చే వరల్డ్‌కప్‌లో ఆడొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన జెర్సీ ధరించి మారడోనాకు నివాళ్లర్పించాడు. మెస్సీ ప్రస్తుతం అమెరికాలో MLS లీగ్‌లో ఇంటర్‌ మియామీ జట్టు తరపున అద్భుతంగా ఆడుతున్నాడు. 2026 లో జరగనున్న వరల్డ్‌కప్‌కు కూడా అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో ఆడవచ్చనే ఊహాగానాలకు తెరలేపాడు.

అర్జెంటీనాకు ఇంతకు ముందు దివంగత డిగో మారడోనా తన దేశానికి మొట్టమొదటి సారిగా వరల్డ్‌కప్ అందించి వారి ఆరాధ్యుడయ్యాడు. మారడోనా తర్వాత ఆ బాధ్యత లియోనల్ మెస్సీపై పడింది. 2014 వరల్డ్‌కప్‌ను దాదాపు సాధించాడు, కానీ చివరి నిమిషంలో జర్మనీ గోల్‌ కొట్టి కప్ ఎగురేకుపోయింది. మెస్సీ నైరాశ్యంలో మునిగిపోయాడు. ప్రస్తుతం 34 యేళ్ల వయసున్న మెస్సీ వచ్చే వరల్డ్‌కప్ నాటికి 39 కి చేరుకోనున్నాడు. మెస్సీ ఇప్పుడున్న ఫాంని కొనసాగిస్తే వచ్చే వరల్డ్‌కప్‌లోనూ అతని మాయాజాలాన్ని చూడవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story