Lionel Messi: మళ్లీ మెరిసిన మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు , వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi) అద్భుత ఫామ్ కొనసాగుతోంది. కొత్త క్లబ్ ఇంటర్ మియామిలో చేరినప్పటి నుంచి వరుస గోల్స్‌తో చెలరేగిపోతున్న మెస్సీ... మరోసారి మెరిశాడు. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గోల్స్ చేసిన ఈ స్టార్ ఆటగాడు.. అయిదో మ్యాచ్‌లోనూ గోల్ చేసి తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. లియోనెల్ మెస్సీ గోల్స్ పరంపరతో ఇంటర్ మియామి విజయాల పరంపర కూడా కొనసాగుతోంది.
లీగ్స్ కప్ క్వార్టర్ ఫైనల్ గేమ్‌లో షార్లెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఇంటర్ మియామి ఘన విజయం సాధించింది. మెస్సీ 86వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. కొత్త క్లబ్‌తో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో అతనికి ఇది ఎనిమిదో గోల్ కావడం విశేషం. లీగ్స్ కప్‌లో ఇంటర్ మియామి ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలో విజయం సాధించింది. మెస్సీతోపాటు జోసెఫ్ మార్టినెజ్, రాబర్ట్ థామస్ కూడా గోల్స్ చేయడంతో మెస్సీ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గత ఏడాది అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించిన మెస్సీ ఆ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com