MESSI: రేపు హైదరాబాద్‌కు ది గోట్ మెస్సీ

ఫుట్‌బాల్ దిగ్గజం.. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ.. ది గోట్ ఇండియా టూర్-2025లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు. డిసెంబరు 13వ తేదీ, శనివారం నాడు హైదరాబాద్ వస్తున్న మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో ఆ రోజు నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తలపడనున్నారు. మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆ టూర్ ప్రమోటర్ పార్వతిరెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 13వ తేదీన సింగరేణి ఆర్ఆర్-9, అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఉంటుందన్నారు. ఇందులో సింగరేణి జట్టు తరఫున రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడుతున్నారని వెల్లడించారు.
హైదరాబాద్‌కు బిల్‌గేట్స్ వచ్చాక.. సిటీ ఫేమ్ మరో రేంజ్‌ని టచ్ చేసింది. అంతటి బిల్ క్లింటనే హైదరాబాద్ లో అడుగు పెట్టిన తరువాత ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అండ్ మీడియాలో హైదరాబాద్‌కు గొప్ప బ్రాండింగ్ జరిగింది. టెక్నాలజీ అని, ఏఐ అని, సోషల్ మీడియా అని.. ఆ రూట్లో ఎంత ప్రయత్నించినా రాని బ్రాండింగ్.. కొన్నిసార్లు ఒక్క పర్సన్‌తో వచ్చేస్తుంది. అప్పటి దాకా జరగని మార్కెటింగ్ ఆ ఒక్క ఈవెంట్‌తో జరిగిపోతుంది. బట్.. దాన్ని ఒడిసిపట్టి, ప్లాన్ చేయడంలోనే ఎవరి కెపాసిటీ ఎంతో తేలుతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానిది సూపర్ సక్సెస్. ఇప్పుడున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మెస్సీ తరువాతనే ఎవరైనా. అలాంటి వ్యక్తిని హైదరాబాద్‌కు రప్పిస్తోంది. ఇంతకీ మెస్సీ... ఈ నెల 12వ తేదీ రాత్రికి మెస్సీ కోల్‌కతాకు చేరుకుంటాడు. 13వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ‘ది గోట్’ హైదరాబాద్‌కు చేరుకుంటాడు. అతడితో పాటు 200 మందితో కూడిన జంబో సిబ్బంది బృందం హైదరాబాద్‌కు వస్తుంది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది.
మెస్సీ వసతి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఆరోజు సాయంత్రం 5.30 నుంచి 6.15 గంటల వరకు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటాడు. రాత్రి 7 నుంచి 9 వరకు ఉప్పల్ స్టేడియంలో ‘మెస్సీ మాయ’ అలరించనుంది. తొలుత సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు రేవంత్‌రెడ్డి..మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. అనంతరం యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్ క్లాస్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. చివర్లో మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది. ఆరోజు రాత్రి మెస్సీ నగరంలోనే బస చేసి మర్నాడు ఉదయం ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరతాడు. ‘ది గోట్ ఇండియా టూర్’ ప్రస్తుతం ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్న ట్యాగ్‌లైన్. హైదరాబాద్‌లో 13వ తేదీన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్‌బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం అమితాసక్తి కనబరుస్తున్నారు.
మ్యాచ్‌ను చూడాలనుకునే వారి కోసం డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంచామని పార్వతిరెడ్డి తెలియజేశారు. టికెట్ ప్రారంభ ధర రూ.1,300 అని కార్పొరేట్ బాక్సుల్లోని టికెట్ల ధర రూ.22 వేల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ విధానంలో టికెట్ల విక్రయం లేదని, ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయాలని ప్రేక్షకులకు సూచించారు. మ్యాచ్‌ను సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

