మీరాబాయి చానుకి స్వర్ణ పతకం అందే ఛాన్స్.. ఎందుకో తెలుసా..!

Mirabiai Chanu: ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో ఫలితం మారే అవకాశం ఉందా..! బంగారు పతకం సాధించిన చైనా అధ్లెట్‌కు డోప్ పరీక్షలు నిర్వహించాలని ఎందుకు భావిస్తున్నారు..?గోల్డ్ మెడల్ విన్నర్ అయిన హు జిహుయి టోక్యోలోని ఒలింపిక్ విలేజ్‌లోనే ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఒకవేళ ఆమెకు నిర్వహించే డోప్ పరీక్షల్లో ఆమె విఫలమైతే నిబంధనల ప్రకారం ఆ గోల్డ్‌మెడల్ 2వ స్థానంలో నిలిచిన మీరాబాయికి అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ పోటీల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను రజత పకతం సాధించింది. ఇది బంగారు పతకంగా మారే అవకాశం ఉంది.
శనివారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. చైనా అథ్లెట్ హు జిహుయి 210 కిలోలు ఎత్తి ప్రపంచ రికార్డుతో పడిసి పతకం సాధిస్తే, మీరాబాయి చాను 202 కిలోల బరువు ఎత్తి రజతం గెలుచుకుంది. ఇండియోనేషియా క్రీడాకారిణి 3వ ప్లేస్‌లో నిలిచి కాంస్య పతకం పొందింది. ఇప్పుడు యాంటీ డోపింగ్ అధారిటీస్ చేస్తున్న పరీక్షలపై జిహుయి భవితవ్యం ఆధారపడి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com