క్రీడలు

MS DHONI 16 Years : ధోనీ రనౌట్‌కు 16 ఏళ్లు!

ధోనీ అందరికి బిగ్ షాక్ ఇస్తూ ఈ ఏడాది ఆగస్టు 15 న అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ధోనీని ప్రేక్షకులు ఇక ఐపీఎల్‌లో మాత్రమే చూడగలరు.

MS DHONI 16 Years : ధోనీ రనౌట్‌కు 16 ఏళ్లు!
X

ఎంఎస్ ధోని.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. టీంఇండియా జట్టుకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలను అందించాడు. ఐసీసీ టైటిళ్ళు (టీ20, వన్డే ప్రపంచకప్‌)తో పాటు చాంపియన్స్ ట్రోఫీ అందించిన ఏకైక కెప్టెన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు ధోనీ. అలాంటి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 16 సంవత్సరాలు అవుతుంది. ఇదే రోజున (డిసెంబర్ 23, 2004)న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ తో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.

అయితే ఈ మ్యాచ్ లో ధోనీ తొలి బంతికే రనౌట్‌ అయి అందరినీ నిరాశపరిచాడు. తొలి మ్యాచ్ లో రనౌట్‌ అయినప్పటికీ ధోనీ మాత్రం ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. కొద్దిరోజుల తర్వాత ధోనీ సత్తా ఏంటో అందరికి తెలిసింది. జట్టులో బెస్ట్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్నాడు. బాట్స్ మెన్స్ అవుట్ అయినప్పటికీ ధోనీ ఉన్నాడులే అనే భరోసాను సగటు ప్రేక్షకుడికి అందించాడు. అలాంటి ధోనికి కెప్టెన్సీ పదవి కేవలం మూడు సంవత్సరాల్లోనే వచ్చింది. వచ్చిన మొదటి ఛాన్స్ తోనే ఐసీసీ టీ20ని గెలిపించి తానేంటో మరోసారి చూపించాడు. అలా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోపీలను సాధించిపెట్టి బెస్ట్ కెప్టెన్ల సరసన చేరాడు.

మ్యాచ్ గెలిచినా, ఓడినా ధోని మాత్రం ఒకేలా ఉండడం అతనిలో ఉన్న బెస్ట్ స్పెషాలిటి.. అందుకే ధోనిని మిస్టర్ కూల్ అంటారు. అయితే విచిత్రం ఏంటంటే ఏ రనౌట్‌తో అయితే ధోని తన కెరీర్‌ను ప్రారంభించాడో అదే రనౌట్‌తో కెరీర్‌ను ముగించాడు. 2019 ప్రపంచకప్‌లో భాగంగా కివీస్ జట్టుతో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మార్టిన్‌ గప్టిల్‌ వేసిన డైరెక్ట్‌ త్రో ద్వారా ధోని రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఏడాది పాటుగా ధోని క్రికెట్ కి దూరంగా ఉంటూ వచ్చాడు.

ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ పైన చాలా ఉహాగానాలు వచ్చాయి. వాటిపైన స్పందించిన ధోని అందరికి బిగ్ షాక్ ఇస్తూ ఈ ఏడాది ఆగస్టు 15 న అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ధోనిని ప్రేక్షకులు ఇక ఐపీఎల్‌లో మాత్రమే చూడగలరు. మొత్తం ధోని తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు.

Next Story

RELATED STORIES