MS Dhoni : మళ్లీ ధోనీకే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు..!

MS Dhoni : మళ్లీ ధోనీకే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు..!
MS Dhoni : రవీంద్ర జడేజా సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించినంతగా రాణించడం లేదు.

MS Dhoni : రవీంద్ర జడేజా సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించినంతగా రాణించడం లేదు.. ఇప్పటివరకు చెన్నై ఎనిమిది మ్యాచ్ లు ఆడగా, కేవలం రెండింటిలో మాత్రమే విజయుం సాధించింది. దీనితో జట్టు యాజమాన్యం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి అప్పగించింది. ''ఆటపై దృష్టిసారించేందుకే రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. అందుకే జట్టును నడిపించాలని ఎంఎస్ ధోనీని కోరాం. నాయకత్వ పగ్గాలను అందుకునేందుకు ఎంఎస్ ధోనీ అంగీకరించాడు. ఇక నుంచి జడేజా తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాడు'' అని జట్టు యాజమాన్యం వెల్లడించింది. కాగా ధోని చెన్నై జట్టుకు ముందునుంచి కెప్టెన్ గా వ్యవహరిస్తూ వచ్చాడు.. ఇప్పటివరకు ఆ జట్టుకు నాలుగు IPL టైటిల్స్ అందించాడు

Tags

Next Story