CSK Captain: చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్.. ధోనీ ప్లేస్‌లో..

MS Dhoni (tv5news.in)

MS Dhoni (tv5news.in)

CSK Captain: ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ సీజన్ మొదలుకానుంది. ఇంతలోనే ఎమ్ ఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే తగిలింది.

CSK Captain: క్రికెట్‌లో చాలామందికి ఎక్కువగా నచ్చే ఫార్మ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ ఐపీఎల్ కోసం క్రికెట్ లవర్స్ అంతా సంవత్సరమంతా ఎదురుచూస్తారు. 2007లో ఐపీఎల్ మొదలయిన తర్వాత ఎప్పుడూ దీనికి బ్రేకులు పడలేదు. కరోనా సమయంలో సమ్మర్‌లో జరగాల్సిన ఐపీఎల్.. నవంబర్‌లో జరిగింది. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ సీజన్ మొదలుకానుంది. ఇంతలోనే ఎమ్ ఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే తగిలింది.

మామూలుగా ఐపీఎల్‌లో ఏ ఒక్క ఆటగాడు కూడా ఒక్క టీమ్‌కే పరిమితం కాలేడు. మెగా ఆక్షన్ సమయంలో ఆటగాడి కోసం ఏ టీమ్ ఎక్కువగా వేలం పాడితే.. ఆ ఆటగాడు ఆ టీమ్‌కే సొంతం. కానీ ధోనీ మాత్రం ఐపీఎల్‌లో తన ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుండి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫునే ఆడుతున్నాడు. కెప్టెన్‌గా సీఎస్‌కేను ఎన్నోసార్లు గెలిపించాడు. ఇక నుండి జరగనున్న ఐపీఎల్ సీజన్లలో ధోనీ కెప్టెన్ కాడని అధికారికంగా ప్రకటించింది సీఎస్‌కే.

చెన్నై సూపర్ కింగ్స్ ఓ ఏడాది ఐపీఎల్ ఆడకుండా సస్పెన్షన్‌కు గురైంది. అయినా కూడా తరువాతి సంవత్సరం వెంటనే కప్ గెలిచి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. అయితే చాలామంది ఐపీఎల్ లవర్స్ ఇష్టపడే సీఎస్‌కే కెప్టెన్ ఇకపై ధోనీ కాదని అనౌన్స్‌మెంట్ వచ్చింది. రవీంద్ర జడేజా.. సీఎస్‌కేకు కొత్త కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఇక త్వరలోనే ధోనీ పూర్తిగా ఐపీఎల్‌కు కూడా రిటైర్‌మెంట్ ఇవ్వనున్నాడని టాక్.

Tags

Read MoreRead Less
Next Story