DHONI: అడిగితే తప్ప సాయం చేయను

DHONI: అడిగితే తప్ప సాయం చేయను
X
రుతురాజ్ కెప్టెన్సీ అద్భుతంగా ఉందన్న ధోనీ... తాను-కోహ్లీ మంచి స్నేహితులమని వ్యాఖ్య

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ ప్రశంసించారు. 'రుతురాజ్ నన్ను అడిగితే తప్ప నేను సాయం చేయను. ఒకవేళ నేను ఏదైనా సలహా చెప్పినా అది కచ్చితంగా అనుసరించాలని అనుకోవద్దని అతడికి ముందే చెప్పాను. కెప్టెన్‌గా రుతు ఉన్నా నిర్ణయాలు నేనే తీసుకుంటాననుకుంటారు చాలా మంది. అందులో ఏమాత్రం నిజం లేదు’ అని ధోనీ స్పష్టం చేశారు.

కోహ్లీ కెప్టెన్ షిప్‌‌పై..

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని.. 'కోహ్లీ'తో తనకున్న బంధాన్ని షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ' మొదట మా బంధం ఒక కెప్టెన్ కు యంగ్ ప్లేయర్ కు ఉండే సంబంధం లాగే ఉండేది. తర్వాత మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం, స్నేహితులుగా మారిపోయాం. ఇప్పుడు కూడా తరుచుగా మాట్లాడుకుంటాం, ఇద్దరం కెప్టెన్ షిప్ నుంచి తప్పుకోవడంతో చాలా సమయమే లభిస్తుంది' అంటూ సరదాగా కామెంట్ చేశారు.

ఆ రికార్డును బ్రేక్ చేయడమే టార్గెట్: ఇషాన్ కిషన్

SRH బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆదివారం RR తో జరిగిన మ్యాచ్‌లో SRH 286 పరుగుల టార్గెట్ అందించగా, ఇషాన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'మ్యాచ్‌ మధ్యలో వాటర్‌ బాటిల్‌తో ఒకరు వచ్చారు. ఈసారి ఎలాగైనా 287 దాటాలి అన్నారు. కానీ ఈ మ్యాచ్‌లో మేము ఆ రికార్డును దాటలేకపోయాం. భవిష్యత్ మ్యాచ్‌ల్లో ఆ రికార్డును బ్రేక్ చేయడమే టార్గెట్' అన్నారు.

ఈ ఐపీఎల్‌లో 300 స్కోరు చూస్తాం: డేల్‌ స్టెయిన్‌

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 286 పరుగులు చేసింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్‌లో తప్పకుండా 300+ స్కోరు చూస్తామని అభిప్రాయపడ్డాడు. ఏప్రిల్ 17 తేదీన ముంబైతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆ ఫీట్ సాధిస్తుందని అంచనా వేశారు. ఆ రోజు వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారనుందా లేదా చూడాలి.

Tags

Next Story