DHONI: రిటైర్మెంట్‌పై ధోనీ కీలక వ్యాఖ్యలు

తన రిటైర్మెంట్ గురించి జరుగుతున్న ప్రచారంపై ఎంఎస్ ధోనీ స్పందించాడు. భవిష్యత్ ప్రణాళికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. తనకింకా 4 నుంచి 5 నెలల సమయం ఉందని, అప్పుడే తొందరేమీ లేదన్నాడు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే ఫిట్‌గా ఉండాలని, దానిపై తాను దృష్టిపెట్టానన్నాడు. ఆటగాళ్లు తమ ప్రదర్శన సరిగా లేదని రిటైర్ అవ్వడం మొదలుపెడితే, కొందరు 22 ఏళ్లకే రిటైర్ అవ్వాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు.
అయోధ్య హనుమాన్‌ను దర్శించుకున్న కోహ్లీ దంపతులు
టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు అయోధ్యలోని ప్రముఖ హనుమాన్ గర్హి దేవాలయాన్ని సందర్శించుకున్నారు. హనుమంతుణ్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పూజారులు పూలమాలలతో కోహ్లీ, అనుష్క శర్మ దంపతులను సత్కరించారు. నుదుటన తిలకం దిద్దారు. తర్వాత స్వామివారి చిత్రపటాలను అందించారు. ఇటీవలే కోహ్లీ, అనుష్క శర్మ ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహరాజ్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు.
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
కోల్‌కత్తా స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సునీల్ కోల్‌కత్తా తరఫున ఇప్పటివరకు ఐపీఎల్‌లో 191, ఛాంపియన్స్ లీగ్ టీ20లో 18 వికెట్లు తీశాడు. మొత్తంగా 209 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సమిత్ పటేల్(208-నాటింగ్‌హామ్‌షైర్) పేరిట ఉన్న రికార్డును నరైన్ బద్దలు కొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com