Dhoni daughter receives Argentina Jersey: ధోనీ కూతురికి మెస్సీ మరిచిపోలేని బహుమతి

Dhoni daughter receives Argentina Jersey: MS ధోని కుమార్తె జీవా లియోనెల్ మెస్సీ నుండి సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని అందుకుంది. డిసెంబర్ 18న ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా ఫ్రాన్స్‌ను ఓడించడంతో FIFA ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుని తన సుదీర్ఘ ఆటను ముగించాడు. మెస్సీ ఒక గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు.
మెస్సీ ట్రోఫీని గెలుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మెస్సీకి భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం, భారత దిగ్గజ మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీని పంపించాడు. దానిపై ప్రేమపూర్వక వాఖ్యలు రాసి చిట్టితల్లికి పోస్ట్ చేశాడు. జెర్సీని వేసుకుని జీవా మురిసిపోయింది.
మెస్సీ జీవాకు "పారా జీవా (జివా కోసం)" అనే సందేశంతో సంతకం చేసిన షర్ట్‌ను పంపాడు. తాను పంపిన జెర్సీని ధరించిన జీవా ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కి "తండ్రిలా, కూతురు" అని క్యాప్షన్ పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com