క్రీడలు

కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !

మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ళే.. అంతకుమించి మంచి స్నేహితులు కూడా.. అయితే కోహ్లి కోసం ధోని చిన్న త్యాగం చేశాడు

కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !
X

మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి.. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ళే.. అంతకుమించి మంచి స్నేహితులు కూడా.. అయితే కోహ్లి కోసం ధోని చిన్న త్యాగం చేశాడు. తాజాగా ఆ వీడియోని ఐసీసీ అభిమానులతో పంచుకుంది. 2014 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సెమీఫైనల్స్‌లో కోహ్లి కోసం ధోని త్యాగం చేశాడు. ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 172/4 స్కోర్‌ సాధించింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ కు కోహ్లీ (72 నాటౌట్‌) తన అద్భుతమైన బ్యాటింగ్ తో రెచ్చిపోవడంతో భారత్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

అయితే వాస్తవానికి ఈ మ్యాచ్ 19 ఓవర్లకే పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ ధోని దీనిని మరో ఓవర్ కి వెళ్ళడానికి ధోనినే కారణం.. సౌత్ఆఫ్రికా బౌలర్ బ్యూరన్‌ హెండ్రిక్స్‌ వేసిన 18.5వ బంతికి కోహ్లీ సింగిల్‌ తీయడంతో భారత్ స్కోరు 172 కావడంతో మ్యాచ్ సమం అయింది. అయితే విజయానికి మరో పరుగు అవసరం అనుకున్న టైంలో హెండ్రిక్స్‌ వేసిన 18 ఓవర్ చివరి బంతిని ధోని డిఫెన్స్‌ ఆడాడు.

మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ ఇది చూసి నవ్వుకున్నాడు. అప్పటికే 68 పరుగులతో అజేయంగా ఉన్న కోహ్లినే మ్యాచ్ కి ఫినిషింగ్ ఇవ్వాలని అనుకున్నాడు ధోని . అందుకే ఆ బంతిని డిఫెన్స్‌ ఆడాడు. ఇక ఆ తర్వాతి ఓవర్ లోని మొదటి బంతిని కోహ్లి ఫోర్ గా మలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆ తరవాత లంక జట్టుతో జరిగిన ఫైనల్ లో భారత్ ఓటమిపాలైంది.


Next Story

RELATED STORIES