Swimming: జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డుల మోత

హైదరాబాద్‌లో జరుగుతున్న 76వ జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. పోటీల్లో రెండవ రోజు భారత క్రీడాకారిణులు మన్నా పటేల్, లినేషా ఏకే, నైనా వెంకటేష్‌లు పలు జాతీయ రికార్డులు నెలకొల్పారు.
భారత స్టార్ స్మిమ్మర్ మన్నత్ పటేల్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్ విభాగంలో 1 నిమిషం 3.48 సెకండ్లలో పూర్తి చేసి నూతన రికార్డ్ నెలకొల్పింది. మరో క్రీడాకారిణి లినేషా ఏ.కే. 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో 2 నిమిషాల 37.35 సెకండ్లతో జాతీయ రికార్డ్ నెలకొల్పింది.
మహిళల 50మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో స్విమ్మర్ నైనా వెంకటేష్ ఒకే రోజు రెండు రికార్డులు నెలకొల్పి తన రికార్డు తానే సరిచేసుకుంది.
బటర్ ఫ్లై హీట్స్ విభాగంలో 28.01 సెకండ్లతో రికార్డు నెలకొల్పి, కొన్ని గంటల తర్వాత 27.74 సెకండ్లతో తన రికార్డును తానే మెరుగుపరచుకుంది.
గచ్చిబౌలిలో జరుగుతున్న 76వ జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జులై 5 వరకు జరగనున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో పురుష, మహిళా క్రీడాకారిణులు ఫ్రీస్టైల్, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, బటర్‌ఫ్లై, వ్యక్తిగత మెడ్లే, మిక్స్‌డ్ టీం రిలే వంటి పలు విభాగాల్లో పోటీ పడనున్నారు. ఇందులో విజయం సాధించిన క్రీడాకారులు 2024 పారిస్ ఒలంపిక్స్‌కి నేరుగా అర్హత పొందుతారు. పారిస్ ఒలంపిక్స్‌కి అర్హత సాధించడానికి చివరి గడువు 2024 జూన్ 23 దాకా ఉంది. అలాగే సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జూలో జరగనున్న ఆసియా క్రీడలకు అర్హత కావడానికి కూడా క్రీడాకారులకు ఈ పోటీలే చివరి అవకాశం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com