నా కొడుకు కోసం రూ.20 కోట్లు రెడీ చేసుకోమని చెప్పా: పీయూష్ చావ్లా

నా కొడుకు కోసం రూ.20 కోట్లు రెడీ చేసుకోమని చెప్పా: పీయూష్ చావ్లా
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న IPL 2023లో ఇటీవలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 103* పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న IPL 2023లో ఇటీవలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 103* పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ జట్టు విజయానికి సహకరించిన మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతడే వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టుతో జరిగిన ఆటలో అతను మరోసారి తన ప్రతిభ కనబరిచాడు. అతను తన నాలుగు ఓవర్ల స్పెల్‌ను 2/36తో ముగించాడు.

34 ఏళ్ల పియూష్ ఈ సీజన్‌లో 19 వికెట్లతో IPL 2023 పర్పుల్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ కోసం చావ్లా రూ. 50 లక్షలు అందుకుంటున్నాడు. ఈ సీజన్‌లో తన డ్రీమ్ రన్ JioCinema ఇంటరాక్షన్‌లో చావ్లా మాట్లాడుతూ..

"నేను నా కొడుకు కోసం ఆడుతున్నాను. నేను ఆడటం ఎప్పుడూ తను చూడలేదు. నేను నా ప్రైమ్‌లో ఆడుతున్నప్పుడు అతడు చాలా చిన్నవాడు. కానీ ఇప్పుడు అతడికి ఆరేళ్లు వచ్చాయి.. ఆటను అర్థం చేసుకునే వయసు వచ్చింది. నేను ఏం చేస్తున్నానో తెలుసు. నేను కష్టపడి పనిచేయడానికి నా కొడుకే కారణం అని చావ్లా చెప్పాడు. మరో పదేళ్లలో నా కొడుకు మంచి బ్యాటర్ అవుతాడు.. IPL అతడికి ఇవ్వడానికి రూ.20 కోట్లు రెడీ చేసుకోవాలి అని ముంబై ఇండియన్స్ కు చెప్పా ను అని చావ్లా తెలిపాడు.

ఇటీవల డ్వేన్ బ్రావోను అధిగమించి IPL యొక్క ఆల్-టైమ్ వికెట్-టేకర్‌గా చావ్లా నిలిచాడు. ఈ సంవత్సరం ముంబై ఇండియన్స్ ఆట తీరు గురించి మాట్లాడుతూ, ఐదుసార్లు ఛాంపియన్‌లు సీజన్‌లోని మొదటి కొన్ని గేమ్‌లలో ఓడిపోవడంతో కొంత నిరాసక్తత నెలకొంది అని అన్నాడు.

కొన్ని గెలిచారు కొన్ని ఓడిపోయారు కాబట్టి ఇది అప్పుడు ఒక టాప్సీ-టర్వీ రైడ్. కానీ రోహిత్ శర్మ జట్టు గొప్ప ప్రదర్శన ఇచ్చారని అన్నారు. వారు టోర్నమెంట్‌లో 200 పరుగుల మార్కును అధిగమించారు. అనేక విజయాలను నమోదు చేసుకున్నారు అని చెప్పారు. తద్వారా ప్లేఆఫ్‌లకు అర్హత సాధించే అవకాశాలను బలోపేతం చేశారు అని చావ్లా తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story