World Cup 2023: ఫైనల్లో భారత్- ఇంగ్లాండ్... ముత్తయ్య మురళీధరన్ జోస్యం

2023 వరల్డ్‌కప్ గెలిచే జట్లలో భారత జట్టు ఫేవరేట్ అని శ్రీలంక మాజీ స్విన్నర్ ముత్తయ్య మురళీధరన్ జోస్యం చెప్పాడు. స్వదేశంలో భారత్ వరల్డ్ కప్ ఆడుతున్నందున భారత్‌కు అవకాశాలున్నాయన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడతాయని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ముత్తయ్య మాట్లాడుతూ.. ఈ వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్, భారత్‌లు తలపడితే చూడాలనుకుంటున్నానన్నాడు. భారత్‌కు స్వదేశంలో ఆడుతుంది కాబట్టి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా ఉండబోతుందని వెల్లడించాడు. ముత్తయ్య మురళీధరన్‌కు, 2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచే తన కెరీర్‌లో చివరిది.
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఉపఖండం నుంచి వచ్చే జట్లకు ఈ వరల్డ్‌కప్‌లో మంచి విజయావకాశాలున్నారు. పిచ్‌లు స్పిన్నర్లకు సహకరించడమే కారణం. ఆఫ్ఘానిస్తాన్‌లో ప్రతిభావంతులైన స్పిన్నర్లున్నారన్నాడు. కానీ వారి బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. కావున వారికి విజయావకాశాలు తక్కువేనని పేర్కొన్నాడు. 2011 లో రెండు అత్యుత్తమ జట్లైన శ్రీలంక, భారత్‌లు ఫైనల్‌కి వచ్చాయి. వీరిలో ఉత్తమంగా ప్రతిభ చూపిన జట్టే గెలిచిందని అన్నాడు.
అక్టోబర్ 5న ప్రారంభమవనున్న క్రికెట్ 2023 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ని ఐసీసీ (ICC) విడుదల చేసింది. టోర్నీలో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య చెన్నైలో జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుండగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com