nawab: నవాబ్ ఆఫ్ క్రికెట్.. టైగర్ పటౌడీ

nawab: నవాబ్ ఆఫ్ క్రికెట్.. టైగర్ పటౌడీ
X
క్రికెట్ చరిత్రలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అలియాస్ టైగర్ పటౌడీ ఈ పేరుకు భారత క్రికెట్ చరిత్రలోనే కాకుండ బ్రిటిష్ క్రికెట్ చరిత్రలోను ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవల ఆయన పేరు మీదున్న 'పటౌడీ ట్రోఫీ'ని అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే, మొదట పటౌడీ ట్రోఫీ‌కి ఆ పేరును సజెస్ట్ చేసింది ఇండియా కాదు ఇంగ్లాండ్. భారత్‌లో అతడికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అంతకు మించి ఇంగ్లాండ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. అతడు కేవలం ఒక అసాధారమైన ప్లేయర్ మాత్రమే కాదు గ్రేట్ పర్సనాలిటీ.

దిగ్గజ ఆటగాడి మార్గనిర్దేశం...

పటౌ­డీ 1961-75 మధ్య కా­లం­లో భా­ర­త్ తరు­పున 46 టె­స్టు­లు ఆడి 2,793 పరు­గు­లు (6 సెం­చ­రీ­లు) చే­శా­డు. 21 ఏళ్ల వయ­సు­లో­నే టె­స్టు టీం­కి కె­ప్టె­న్‌­గా మారి సం­చ­ల­నం సృ­ష్టిం­చా­డు. అయి­తే, అత­న్ని గ్రే­ట్ పర్స­నా­లి­టీ­‌­గా ని­లి­పిన అం­శా­లు వేరు. యా­క్సి­డెం­ట్‌­లో కుడి కన్ను పో­యి­న­ప్ప­టి­కీ అతడు కవ­ర్స్‌­లో చి­రుత లాం­టి వే­గం­తో ఫీ­ల్డిం­గ్ చేసే వాడు. టై­గ­ర్ టీ­మ్‌­లో 'భా­ర­తీ­య­త' తె­చ్చా­డు. ఉత్తర, దక్షిణ అనే భా­వా­ల­ను సమూ­లం­గా తొ­లి­గిం­చా­డు. భారత జట్టు­కు వి­దే­శా­ల్లో తొలి వి­క్ట­రీ­ని అం­దిం­చా­డు. ఈ వి­జ­యం భారత క్రి­కె­ట్‌­లో ఆత్మ­వి­శ్వా­సా­న్ని పెం­చిం­ది. అయన దూ­కు­డు మన­స్త­త్వం, స్టై­లి­ష్ బ్యా­టిం­గ్, గె­లు­పు కోసం మొం­డి వై­ఖ­రి టీ­మిం­డి­యా­ను అత్యు­త్తమ జట్టు­గా మా­ర్చా­యి.

ఇం­గ్లాం­డ్‌­లో­ను నవా­బే

టై­గ­ర్ ఇం­గ్లాం­డ్‌­లో­ని విం­చె­స్ట­ర్ కా­లే­జ్, ఆక్స్‌­ఫ­ర్డ్ యూ­ని­వ­ర్శి­టీ­లో చది­వా­డు. సస్సె­క్స్ కౌం­టీ టీ­మ్‌­కి ఆడా­డు, ఆక్స్‌­ఫ­ర్డ్ క్రి­కె­ట్ టీ­మ్‌­కి కె­ప్టె­న్. అతడు తన సొ­గ­సు, ఆటతో ఇం­గ్లాం­డ్‌­లో అనేక మం­ది­కి రోల్ మో­డ­ల్‌­గా మా­రా­డు. అతడి ఇం­గ్లీ­ష్ యాస, రా­య­ల్ వైబ్, గ్రే­ట్ కా­మె­డీ టై­మిం­గ్ బ్రి­టి­ష్ అభి­మా­ను­ల­ను వి­ప­రీ­తం­గా ఆక­ట్టు­కుం­ది. ఇప్ప­టి­కి అనే­క­మం­ది ఇం­గ్లాం­డ్ ప్లే­య­ర్లు అత­డి­ని హీ­రో­లా ట్రీ­ట్ చే­స్తా­రు. టైగర్'పటౌడి 1961 -1975 మధ్యకాలంలో మొత్తం 46 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే అందులో 40 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. వాటిలో 6సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాధించారు. ఒక డబుల్ సెంచరీ కూడా ఆయన పేరు మీద ఉంది.

పటౌడీ ట్రోఫీ

2007లో భారత క్రి­కె­ట్ టీం ఏర్ప­డి 75 ఏళ్లు పూ­ర్త­యిన నే­ప­థ్యం­లో భా­ర­త్-ఇం­గ్లాం­డ్ టె­స్ట్ సి­రీ­స్‌­కు పటౌ­డీ ట్రో­ఫీ అని నా­మ­క­ర­ణం చే­సేం­దు­కు ఇం­గ్లాం­డ్ క్రి­కె­ట్ బో­ర్డు ని­ర్ణ­యిం­చిం­ది. అయి­తే, మన్సూ­ర్ అలీ ఖాన్ తం­డ్రి ఇఫ్తి­కా­ర్ అలీ ఖాన్ పటౌ­డీ ఇం­గ్లాం­డ్ టీం­కు ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­డు. ఈ ఇద్ద­రి గౌ­ర­వా­ర్థం ఇం­గ్లాం­డ్ బో­ర్డు ఆ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ప్ర­స్తు­తం ట్రో­ఫీ నుం­చి పటౌ­డీ పే­రు­ను మె­డ­ల్స్‌­కు మా­ర్చా­రు. అతడు పటౌ­డీ రాజా వం­శా­ని­కి చెం­ది­న­వా­డ­ని చాలా మం­ది­కి తె­లి­సిన వి­ష­య­మే. అతడి భా­ర్య షర్మి­లా ఠా­గూ­ర్, కు­మా­రు­డు సైఫ్ అలీ ఖాన్ బా­లీ­వు­డ్‌­లో ది­గ్గజ నటు­లు­గా ఎది­గా­రు.

Tags

Next Story