FIH rankings: మూడో స్థానానికి ఎగబాకిన భారత హాకీ జట్టు

రికార్డు స్థాయిలో నాలుగోసారి ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(4th Asian Champions Trophy) చేజిక్కించుకున్న భారత పురుషుల జట్టు ర్యాంకింగ్స్‌లో(FIH rankings)నూ సత్తాచాటింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(HIF) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా మూడో స్థానానికి ఎగబాకింది.(India move up to number 3) తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పురోగతి సాధించి నాలుగు నుంచి మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన తర్వాత భారత్ మూడో ర్యాంక్‌కు చేరగా.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తిరిగి అదే ర్యాంకును దక్కించుకుంది.
భారత్ 2771.35 పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరింది. నెదర్లాండ్స్ 3095.90 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.... 2917.87 పాయింట్లతో బెల్జియం రెండు స్థానంలో ఉంది. ఇంగ్లండ్ మూడు నుంచి నాలుగో స్థానానికి చేరగా, జర్మనీ, ఆ్రస్టేలియా వరుసగా ఐదు, ఆరో ర్యాంక్‌ల్లో ఉన్నాయి. తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన మలేసియా జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది.
మరోవైపు నాలుగోసారి ఆసియా కప్ దక్కించుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టుపై నజరానాల జల్లు కురుస్తోంది. భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున, సపోర్టింగ్ స్టాఫ్‌లోని ప్రతి సభ్యుడికి రూ. లక్షా 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని హాకీ ఇండియా వెల్లడించింది. భారత హాకీ జట్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ. కోటీ 10 లక్షల భారీ నజరానా ప్రకటించారు.
శనివారం చెన్నై వేదికగా జరిగిన ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4-3 తేడాతో మలేషియాను మట్టికరిపించి ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో టీమ్‌ఇండియా 4-3తో మలేషియాను మట్టికరిపించి నాలుగోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఫైనల్ వరకు ఎదురులేకుండా అజేయంగా నిలిచిన భారత జట్టు తుది పోరులోనూ విజయం సాధించింది. ఓటమి అంచుల నుంచి అద్భుతంగా పోరాడిన భారత్.. నాలుగోసారి ఆసియా కప్‌ను ఒడిసిపట్టింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు అభినందనలని మోదీ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com