NEERAJ: నాకు దేశమే ముందు: నీరజ్ చోప్రా

NEERAJ: నాకు దేశమే ముందు: నీరజ్ చోప్రా
X
విమర్శలపై స్పందించిన జావెలిన్ త్రో స్టార్

భారత జావెలిన్ స్టార్, ఒలింపియన్ నీరజ్ చోప్రా... పాకిస్థాన్ జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మే 24న బెంగళూరులో జరిగే ఎస్‌సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్‌లో పాల్గొనాలని నదీమ్‌ను నీరజ్ చోప్రా ఆహ్వానించాడు. తాను హోస్ట్ చేస్తున్న ఈ పోటీల‌కు నదీమ్‌కు ఆహ్వానం పంపినట్లు నీర‌జ్‌ చోప్రా తెలిపాడు. "నేను అర్షద్‌కు ఆహ్వానం పంపాను. అతను తన కోచ్‌తో చర్చించిన తర్వాత నన్ను సంప్రదిస్తానని చెప్పాడు. ప్రస్తుతానికి అతను పాల్గొనడాన్ని ఇంకా ధృవీకరించలేదు" అని చోప్రా తెలిపాడు. అనంతరం నీరజ్ చోప్రా చేసిన ఆహ్వానాన్ని తాను తిరస్కరించిన‌ట్లు పాకిస్థాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ తెలిపాడు. అయితే నదీమ్‌ను నీరజ్ భారత్ కు అహ్వానించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దేశమే మొదటి ప్రాధాన్యం

"సాధారణంగా నేను తక్కువగా మాట్లాడుతాను. కానీ, తప్పు అనిపించినప్పుడు మాత్రం మౌనం వహించను. దేశంపై నాకు ఉన్న ప్రేమ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గను. నా కుటుంబానికి గౌరవం ఇవ్వడం నా బాధ్యత. నేను అర్షద్ నదీమ్‌ను ఒక అథ్లెట్‌గా మాత్రమే ఆహ్వానించాను. ఇందులో వేరే ఉద్దేశం లేదు. ఎన్‌సీ క్లాసిక్ ఈవెంట్ లక్ష్యం ప్రపంచ స్థాయిలో ఉన్న అథ్లెట్లను భారత్‌కు తీసుకురావడం. మనం కూడా అద్భుతమైన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు నిర్వహించగలమని చూపించడమే దీని ఉద్దేశం" అని నీరజ్ రాసుకొచ్చాడు. చాలామంది తనపై, తన కుటుంబంపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపాడు. పహల్గాంలో ఉగ్రదాడికి ముందే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానన్న నీరజ్... ఆ తర్వాత 48 గంటల్లో చాలా మార్పులు జరిగాయన్నారు. అర్షద్‌ ఎన్‌సీ క్లాసిక్‌కు హాజరుకావడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎప్పుడైనా నా దేశ ప్రయోజనమే నా మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశాడు.

Tags

Next Story