Paris Olympics 2024: ఫైనల్స్ కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. గ్రూప్ Bలో ఉన్న నీరజ్ 89.34 మీటర్ల దూరం విసరడంతో ఫైనల్ లోకి ప్రవేశించాడు. ఈ ఈవెంట్‌లో 84 మీటర్ల మార్కు నేరుగా ఫైనల్ కు అర్హత సాధించేలా సెట్ చేయబడింది. కాగా, భారత్‌కు చెందిన మరో త్రోయర్ కిషోర్ జెనా 80.73 మీటర్ల బెస్ట్ ఎఫర్ట్ సాధించగలిగాడు. దాంతో అతను ఫైనల్ కి అర్హత సాదించలేకపోయాడు.
ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ గేమ్స్‌లో పతకం సాధించడంలో సఫలమైతే నీరజ్ చోప్రా కూడా 2 ఒలింపిక్ పతకాల భారత ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో ఇప్పటివరకు నార్మన్ ప్రిచర్డ్, సుశీల్ కుమార్, పివి సింధు, మను భాకర్ భారతదేశం నుండి 2 ఒలింపిక్ పతకాలు సాధించారు. ఇక గ్రూప్ Aలో ఉన్న కిషోర్ క్వాలిఫికేషన్‌లో తొలి ప్రయత్నంలోనే 80.73 మీటర్ల దూరాన్ని క్లియర్ చేశాడు. దీని తర్వాత అతను తన రెండవ ప్రయత్నాన్ని నమోదు చేయలేదు. ఇక తన మూడవ చివరి ప్రయత్నంలో అతను జావెలిన్‌ను 80.21 మీటర్ల దూరం విసిరాడు. అటువంటి పరిస్థితిలో అతను నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అతని బృందంలోని నలుగురు ఆటగాళ్ళు జావెలిన్ ను 84 మీటర్ల మార్కు కంటే ఎక్కువ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com