Neeraj Chopra : వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో.. ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా..

Neeraj Chopra : వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో.. ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా..
Neeraj Chopra : వరల్డ్‌ అథ్లెటిక్స్‌ జావెలిన్‌ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాడు.

Neeraj Chopra : ఒలింపిక్‌లో సత్తా చాటి భారత్‌కు బంగారు పథకం అందించిన చాంపియన్‌ నీరజ్‌ చోప్రా.. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ జావెలిన్‌ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాడు. 88.39 మీటర్లు జావెలిన్‌ విసిరిన 24 ఏళ్ల భారత స్టార్‌.. గ్రూప్‌ ఏ లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ దూరం నీరజ్‌ కెరీర్‌లో మూడో అత్యుత్తమం. అయితే ఓవరాల్‌గా రెండు గ్రూపుల్లో చూస్తే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆండర్సన్‌ పీటర్స్‌ 89.91 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత చోప్రా రెండో స్థానంలో నిలిచాడు.

ఇక ఫైనల్లో 100 శాతం సత్తా చూపుతానని ఈ సందర్భంగా నీరజ్‌ పేర్కొన్నాడు. అయితే ప్రతిరోజూ విభిన్నమైనది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామన్నాడు. మరోవైపు గ్రూప్‌ బీలో ఆరో స్థానంలో నిలిచిన రోహిత్‌ యాదవ్‌ కూడా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story