NEERAJ: వివాహ బంధంలోకి నీరజ్ చోప్రా

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపియన్ నీరజ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. హిమానీతో నీరజ్ చోప్రా వివాహం రెండు రోజుల క్రితం జరగ్గా.. ఈ విషయాన్ని నీరజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో హిమానీతో నీరజ్ చోప్రా వివాహం రెండు రోజుల క్రితం వేడుకగా జరిగింది. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇరు కుటుంబాలకు చెందిన వారు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నీరజ్ పేర్కొన్నాడు. సోనీపట్ ప్రాంతానికి చెందిన హిమానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. తన మ్యారేజ్‌కు సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రకటన చేయని నీరజ్ చోప్రా.. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పెళ్లికి సంబంధించి 3 ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇందులో తన తల్లితో దిగిన ఓ ఫొటో కూడా ఉంది. కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com