Neeraj Chopra : కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్న నీరజ్ చోప్రా.. కారణమదే..

Neeraj Chopra : భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా... ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు, ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతక విజేత నీరజ్ చోప్రా.... గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది.
అమెరికాలోని యూజీన్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్‌లో నీరజ్ కు గజ్జలల్లో గాయమైంది. దీంతో ఎమ్మారై స్కాన్ చేసిన వైద్యులు.. నీరజ్ నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు. దీంతో అతను కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ పాల్గొనబోడని స్పష్టం చేశారు. అయితే బర్మింగ్ హోమ్‌లో వచ్చే గురువారం నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నీరజ్ ప్రారంభవేడుకల్లో భారత పతాకాన్ని చేతబూని ముందుకు సాగాల్సి ఉంది.
రెండు రోజులక్రితం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించారు. ఫైనల్‌లో 88.13 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా పతకం దక్కించుకున్నారు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్.. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com