Neeraj Chopra : డైమండ్ లీగ్‌లో సత్తా చాటేందుకు నీరజ్ చోప్రా సిద్ధం!

ఈ నెల 30న లౌసేన్‌లో జరగనున్న డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నారు. కండరాల సమస్యతో నెల రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న నీరజ్ ఇప్పుడు కోలుకోలుకున్నారు. టోర్నీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. జావెలిన్ త్రో జాబితాలో నీరజ్ పాల్గొంటాడని డైమండ్ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. ఇదే టోర్నీలో లాంగ్ జెంప్ విభాగంలో భారత్ తరఫున జాస్విన్ ఆల్డ్రిన్, శ్రీశంకర్ పోటీలో ఉన్నారు.
జావెలిన్‌లో నీరజ్ చోప్రాతో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్, జర్మన్ అథ్లెట్ జూలియన్ వెబర్ పోటీ పడనున్నారు.
మే నెలలో చోప్రా శిక్షణ సమయంలో కండరాల ఒత్తిడికి గురయ్యారు. ఈ కారణంగా నెదర్లాండ్స్‌లో జరిగిన FBK గేమ్స్, ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ మీట్ నుంచి వైదొలిగాడు.
ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ అంతర్-రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనలేదు.
డైమండ్ లీగ్‌తో పాటు, ఈ నెల 27న చెక్ రిపబ్లిక్‌లో జరిగే గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావాలో కూడా చోప్రా పాల్గొనే అవకాశం ఉంది.
మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో చోప్రా 88.67 మీటర్ల అద్భుతమైన త్రోతో సీజన్‌ను కైవసం చేసుకున్నాడు.
బుడాపెస్ట్, హంగేరిలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు చోప్రా పాల్గొనే ఇతర ప్రధాన ఈవెంట్‌లు.
టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి, అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా చోప్రా చరిత్ర సృష్టించాడు.
డైమండ్ లీగ్‌లోనూ నీరజ్ చోప్రా తనదైన శైలిలో ఆడి భారత్ ఖ్యాతిని పెంచాలని ఆశిద్దాం.
Tags
- Neeraj Chopra
- #Neeraj Chopra Injury
- #neeraj chopra latest news
- #neeraj chopra javelin throw
- #Neeraj Chopra Diamond League
- Lausanne leg of Diamond League
- niraj chopra
- javelinDiamond League
- #Neeraj chopra in world athletics championship
- #sports
- #javelin throw
- indian sports
- indian javelin throwers
- #Telugu Sports News
- telugu sports
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com