NeerajChopra: మరోసారి డైమండ్‌ లీగ్‌ పై కన్నేసిన నీరజ్ చోప్రా

NeerajChopra: మరోసారి డైమండ్‌ లీగ్‌ పై కన్నేసిన నీరజ్ చోప్రా
X

ఒలంపిక్ బంగారు పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు. జూన్ 30న స్విట్జర్లాండ్‌లోని లాసన్నేలో జరగనున్న డైమండ్‌ లీగ్‌లోని రెండవ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. మే 5న దోహాలో జరిగిన మొదటి లీగ్ ఈవెంట్‌లో 88.67 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. అయితే నీరజ్‌ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 2022 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 89.94 మీటర్ల దూరం విసిరాడు.

నీరజ్ చోప్రా భారత్‌కి అభినవ్ బింద్రా తర్వాత, వ్యక్తిగత ఆటల విభాగంలో ఒలంపిక్స్‌లో బంగారు పతకం అందించాడు.

దోహా డైమండ్ లీగ్‌లో తొలి స్థానంలో నిలిచి 8 పాయింట్లు సాధించి, స్విస్‌ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాద్లెక్‌ 7 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. గ్రెనాడాకి ఆండర్సన్ పీటర్స్ 6 పాయింట్లతో ఉన్నాడు.


జూన్ 30న స్విట్జర్జాండ్‌లో 2వ ఈవెంట్ తర్వాత, జులై 21న మొనాకో డైమండ్ లీగ్, ఆగస్ట్ 31న జురిచ్ లీగ్‌లు జరగనున్నాయి. ఐదవది, చివరిదైన, ఫైనల్ డైమండ్ లీగ్‌ యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరగనుంది.

ఈ టోర్నీలో నీరజ్‌ చోప్రాతో పాటుగా, ఒలంపిక్స్ రజత పతక విజేత వాద్లెచ్, 2 సార్లు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ పీటర్స్ పాల్గొంటారు. ఉక్రెయిన్‌కి చెందిన ఆర్తర్ ఫెల్ఫ్‌నర్, ఫిన్‌లాండ్‌ ఆటగాడు ఒలివర్ హిలాండర్, అమెరికా నుంచి కర్టిస్ థాంప్సన్, ట్రినిడాడ్ & టొబాగో నుంచి కెషోన్ వాల్కాట్, జర్మనీ ఆటగాడు జులియన్ వెబర్ పాల్గొననున్నారు.

Next Story