Sania Mirza : సానియాకు కొత్త బాధ్యతలు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మెంటార్‌గా..

Sania Mirza: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెంటార్‌గా ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నియమితులయ్యారు. దుబాయ్‌లో తన చివరి టోర్నమెంట్ ఆడబోతున్న మీర్జా, RCB ఫ్రాంచైజీలో భాగం అవుతుంది. ఈ చర్య ఆటగాళ్లకు పెద్ద ప్రేరణగా ఉంటుంది.
సానియా క్రికెట్‌ను ఇష్టపడుతుందనేది తెలిసిన విషయమే. క్రికెట్ వేదికలపై తరచు ఆమె కనిపించడమే ఇందుకు నిదర్శనం. సానియా ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి ఆడి ఫైనల్‌కు చేరుకుంది.
"ఇది అద్భుతమైన మ్యాచ్. ఇది నా చివరి స్లామ్, రోహన్‌తో ఆడటం చాలా ప్రత్యేకమైనది. నా 14 ఏళ్ల వయసులో అతను నా మొదటి మిక్స్‌డ్ డబుల్స్ భాగస్వామి. ఈ రోజు నాకు 36. అతని వయస్సు 42. మేము ఇంకా ఆడుతున్నాము. మాకు బలమైన సంబంధం ఉంది "అని సానియా ఫైనల్‌లోకి ప్రవేశించిన తర్వాత బోపన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని పేర్కొంటూ ట్వీట్ చేసింది.
సానియా సాధించిన ఆరు గ్రాండ్‌స్లామ్‌లలో, మూడు మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి. ఆమె మహేష్ భూపతి (2009 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్) మరియు బ్రెజిలియన్ బ్రూనో సోరెస్ (2014 US ఓపెన్)తో కలిసి ఆడి గెలిచింది.
ఆర్సీబీ జట్టు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ , రేణుకా సింగ్ ఠాకూర్ , రిచా ఘోష్ , ఎరిన్ బర్న్స్ , దిశా కసత్ , ఇంద్రాణి రాయ్ , శ్రేయాంక పాటిల్ , కనికా అహుజా , ఆశా శోభన, హీథర్ నైట్ , డేన్ వాన్ నీకెర్క్ , ప్రీతి బోస్ , పూనమ్ ఖేమ్నార్ , కోమల్ జంజాద్ , మేగన్ షుట్ , సహానా పవార్.
విదేశీ ఆటగాళ్ళు: సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, ఎరిన్ బర్న్, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, మేగాన్ షట్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com