NIRAJ: ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా నీరజ్‌చోప్రా

NIRAJ: ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా నీరజ్‌చోప్రా
X
ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం

భారత జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నియామకం ఏప్రిల్ 16, 2025 నుంచి అమలులోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నీరజ్ 2016లో భారత సైన్యంలో నాయబ్ సుబేదార్ హోదాతో చేరి, 2021లో సుబేదార్, ఆ తర్వాత సుబేదార్ మేజర్‌గా పదోన్నతి పొందారు. ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను పొందారు. టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం, పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో భారత్‌కు గౌరవం తెచ్చిన తొలి అథ్లెట్‌గా నీరజ్‌చోప్రా నిలిచారు. 2023లో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతోపాటు 2018, 2023 ఆసియా గేమ్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతలతో పరమ విశిష్ట సేవా మెడల్, పద్మశ్రీ, విశిష్ట సేవా మెడల్లను అందుకున్నారు. గౌరవ హోదాతో నీరజ్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా వంటి క్రీడాకారుల సరసన చేరారు. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న్ అవార్డును 2021లో ప్రదానం చేసింది.

రెండు మెడల్స్ సాధించిన ఒకే అథ్లెట్

ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు మెడల్స్ సాధించిన భారత అథ్లెట్‌గాను నీరజ్ చోప్రా రికార్డ్ సాధించాడు. నీరజ్ చోప్రా కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్, సచిన్ పైలెట్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా.. ప్రాదేశిక సైన్యంలో గౌరవ హోదాను పొందారు. ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరులతో కూడిన సైనిక సంస్థ, వీరు దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి శిక్షణ పొందుతారు. ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ద సమయంలోనూ ప్రాదేశిక సైన్యం.. భారత సైనిక దళానికి సేవలు అందించింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రాదేశిక సైన్యంలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. నీరజ్ చోప్రా మే 16న దోహా డైమండ్ లీగ్, జూన్ 24న ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 అథ్లెటిక్స్ మీట్‌లో పోటీపడనున్నాడు. ఇటీవల పాక్ జావెలిన్ త్రోయర్‌ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించి నీరజ్ విమర్శలు ఎదుర్కొన్నాడు.

Tags

Next Story