BGT: నితీశ్ కుమార్ రెడ్డి శతక గర్జన

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. టాపార్డర్ బ్యాటర్లంతా తడబడ్డ చోట అద్భుత శతకంతో జట్టును పోటీలో నిలిపాడు. కంగారు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న నితీశ్.. సూపర్ సెంచరీతో అదరొగట్టాడు. వాషింగ్టన్ సుందర్ సహకారంతో భారత్ కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 10 ఫోర్లు, 1 సిక్సరుతో నితీశ్శతకం సాధించి రికార్డు సృష్టించాడు. వెలుతురు లేమీ కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి నితీశ్ 105 పరుగులు, మహ్మద్ సిరాజ్ 2 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కంటే 116 పరుగుల వెనుకంజలో ఉంది.
రికార్డ్ బ్రేక్ చేసిన నితీష్
టీమ్ ఇండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో లోయర్ ఆర్డర్‌లో బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నితీశ్ 99 పరుగులు రికార్డు సాధించారు. అయితే మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును నితీశ్ బద్దలు కొట్టారు
తండ్రి భావోద్వేగం
బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో చెలరేగిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి... భారత్ ను మళ్లీ పోరాడే స్థితికి తెచ్చాడు. ఒక్క వికెట్ మాత్రమే చేతిలో ఉన్న వేళ.. ఉత్కంఠకు తెరదించుతూ నితీశ్ ఫోర్ తో సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో స్టేడియంలోనే ఉన్న నితీశ్ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. ఆనంద బాష్పాలు రాల్చాడు. దీంతో అతడి పక్కనున్న వారు నితీశ్ తండ్రిని అభినందిస్తూ సందడి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com