ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ లో ఫైనల్ కు చేరిన జొకోవిచ్

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కు చేరాడు సెర్బియా స్టార్ నోవక్ జకోవిచ్. వరల్డ్ నెంబర్ వన్.. స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్‌తో జరిగిన సెమీస్ పోరులో జొకోవిచ్ 6-3, 5-7,6-1,6-1తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో జొకోవిచ్ గేమ్‌కు కౌంటర్ ఇచ్చిన అల్కరాజ్ తర్వాతి రెండు సెట్లలో నిలవలేకపోయాడు.అయితే గేమ్‌లో మాత్రం అల్కరాజ్ తనదైన సర్వీస్ షాట్లతో జొకోవిచ్‌కి చెమటలు పట్టించాడు.ఇక జొకోవిచ్ కెరీర్‌లో 34వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టాడు.22 టైటిల్స్ గెలిచిన నాదల్‌తో పాటే అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆటగాడిగా జొకోవిచ్ ఉన్నాడు.
ఇక ఫైనల్లో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ అందుకుంటే..23 టైటిల్స్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కనున్నాడు. మరో సెమీఫైనల్లో కాస్పర్ రూడ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌ల మధ్య జరగనుంది. ఈ ఇద్దరిలో గెలిచిన ఆటగాడితో జొకోవిచ్ ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com