NTR : ఒకే బ్యానర్ లో రెండు సినిమాలతో ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీస్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం వార్ 2తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. వార్ 2 ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది. టీమ్ తో తన ఎక్స్ పీరియన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది జూన్ 25న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. ఆ తర్వాత దేవర 2 ఉంటుందనుకున్నారు చాలామంది. బట్ అది ఇప్పట్లో అయ్యేలా లేదు. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.
ఆ మధ్య తమ బ్యానర్ లో ఎన్టీఆర్ తో ఓ సినిమా ఉంటుందన్న విషయం నిర్మాత నాగవంశీ చెప్పాడు. దీనికి త్రివిక్రమ్ దర్శకుడు అని కూడా చెప్పాడు. అరవింద సమేత తర్వాత ఈ కాంబోలో వస్తోన్న మూవీ కాబట్టి ఖచ్చితంగా అంచనాలుంటాయి. ఇది హారిక హాసిని బ్యానర్ లో ఉంటుంది. ఆ తర్వాత సితార బ్యానర్ లో మరో ప్రాజెక్ట్ ఉండబోతోందని కూడా చెప్పాడు. ఈ మూవీ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఉండబోతోంది. నెల్సన్, ఎన్టీఆర్ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ కన్ఫార్మ్ అని చెప్పలేదు నాగవంశీ. తాజాగా ఆ బ్యానర్ లో వెంట వెంటనే రెండు సినిమాలు చేయబోతున్నాడు. పేర్లు వేరయినా ఆల్మోస్ట్ ఈ రెండు బ్యానర్లు కూడా ఒకే కాంపౌండ్ కు చెందినవే అని అందరికీ తెలుసు. సో.. ప్రశాంత్ నీల్ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ చిత్రాలు ఉండబోతున్నాయి. మరి కొరటాల శివ పరిస్థితి ఏంటో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com