CWC2023: నేడే మహా సంగ్రామం

CWC2023: నేడే మహా సంగ్రామం
ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌-ఆస్ట్రేలియా అమీతుమీ.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కోట్లాదిమంది

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. ప్రపంచకప్‌లో మహా సంగ్రామానికి టీమిండియా సిద్ధమైంది. సూపర్‌ సండే రోజున అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో నేడు అమీ తుమీ తేల్చుకోనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న టీమ్‌ ఇండియా చివరి అడుగు వేసి ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్‌తో అదరగొడుతుంటే... బౌలర్లు పదునైన బంతులతో బెదరగొడుతున్నారు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ తుది పోరులో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా విజయం సాధించాలని కోట్ల మంది క్రికెట్‌ అభిమానులు ఆశిస్తున్నారు. కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలను మోస్తున్న రోహిత్‌సేన కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది.


స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ తుది పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించి టీమిండియా విజయం సాధించాలని కోట్లమంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఒత్తేడే ప్రధాన శత్రువుగా టీమిండియా బరిలోకి దిగుతోంది. భారత్‌ బ్యాటింగ్‌లో చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్‌ శర్మ 550 పరుగులతో దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. 90 సగటుతో విరాట్ కోహ్లి 711 పరుగులు చేసి ఈ ప్రపంచకప్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ సెమీఫైనల్లో సెంచరీ చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. రాహుల్‌ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. గిల్‌, జడేజాలు కూడా ఫామ్‌లో ఉన్నారు. KL రాహుల్ ప్రశాంతత, రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ నైపుణ్యం టీమిండియాకు అదనపు బలంగా మారాయి. అమ్రోహా ఎక్స్‌ప్రెస్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న స్పీడ్‌ స్టార్‌ మహమ్మద్ షమీపై ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకూ 23వికెట్లతో షమీ టీమిండియా తురుపుముక్కగా మారాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌లు కూడా రాణిస్తే ఆస్ట్రేలియాపై గెలుపు నల్లేరుపై నడకే. నల్లమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్‌ జరగనుండడంతో.. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను మూడో స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది.


ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పడిలేచిన కెరటంలా సాగి ఫైనల్‌కు చేరుకుంది. తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాల నుంచి కోలుకుని ఆ తర్వాత వరుస విజయాలతో కంగారులు పైనల్‌కు చేరారు. ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని రోహిత్‌ సేనను పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ , ఇషాన్ కిషన్‌, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, సీన్ అబాట్.

Tags

Read MoreRead Less
Next Story