Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ టీమ్‌కు మరో షాక్.. గాయాలతో బౌలర్ ఔట్..

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ టీమ్‌కు మరో షాక్.. గాయాలతో బౌలర్ ఔట్..
Sunrisers Hyderabad: ఇప్పటికే వేలి గాయంతో వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2022లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆటకు దూరమయ్యాడు.

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022లో ప్రేక్షకులు ఊహించని మలుపులు ఎన్నో జరుగుతున్నాయి. స్ట్రాంగ్ టీమ్స్ అనిపించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ముంబాయి ఇండియన్స్ (ఎమ్ఐ) అందరికంటే ముందే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వకుండా వెనుదిరగడం చాలామందిని నిరాశపరిచింది. ప్రస్తుతం చాలామంది క్రికెట్ లవర్స్ ఆశలన్నీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్)పైనే ఉండగా.. తాజాగా ఆ టీమ్‌కు పెద్ద షాకే తగిలింది.

ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ ఆటతీరు మెచ్చుకోదగినదిగా ఉందని క్రికెట్ లవర్స్ అనుకుంటున్నారు. ఇప్పటికీ ఈ టీమ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. బుధవారం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది ఎస్‌ఆర్‌హెచ్. అయితే ఇంతలోనే టీమ్‌లోని బౌలర్‌కు గాయాలు అవ్వడం వల్ల మ్యాచ్‌కు దూరమయ్యాడని షాకింగ్ విషయం బయటికొచ్చింది.

ఇప్పటికే వేలి గాయంతో వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2022లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆటకు దూరమయ్యాడు. అయితే తన స్థానంలో వచ్చిన బౌలర్ సుచిత్‌కు కూడా గాయమయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సన్‌రైజర్స్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నెట్‌లో సుచిత్ ఎక్కడా కనిపించకపోవడం ఈ వార్తలు నిజమే అనిపించేలా చేస్తోంది. సుచిత్ బదులుగా కేన్ విలియమ్సన్ బౌలర్‌గా జట్టును ముందుకు నడిపించనున్నట్టు సమాచారం.

Tags

Next Story