క్రీడలు

Oo Antava: స్టేడియంలో 'ఊ అంటావా' పాట.. స్టెప్పులేసిన క్రికెటర్లు..

Oo Antava: అప్పటివరకు కూల్‌గా, క్యూట్‌గా ఉన్న సమంతను ఒక ఐటెమ్ గర్ల్‌గా ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేస్తారా అన్న డౌట్ ఉండేది

Oo Antava: స్టేడియంలో ఊ అంటావా పాట.. స్టెప్పులేసిన క్రికెటర్లు..
X

Oo Antava: 'పుష్ప' సినిమాలో ప్రతీ అంశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా దేశాలు దాటి, ఖండాలు దాటి ఫేమస్ అయ్యింది. ఇక ఇందులో అల్లు అర్జు్న్ మ్యానరిజంను ట్రై చేయని వారు ఉండరేమో అనిపించేలా ఉంటుంది దీని క్రేజ్. దానితో పాటు పుష్పలోని మరో క్రేజీ అంశం సమంత పాట. ఇప్పుడు ఈ పాటకు ఏకంగా స్టేడియంలోని ఫ్యాన్స్‌తో సహా క్రికెటర్స్‌ కూడా స్టెప్పులేశారు.

అప్పటివరకు కూల్‌గా, క్యూట్‌గా ఉన్న సమంతను ఒక ఐటెమ్ గర్ల్‌గా ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేస్తారా అన్న డౌట్ ఉండేది. కానీ 'ఊ అంటావా' పాట ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండే ప్రేక్షకులు దీనికి కనెక్ట్ అయ్యారు. ఇక లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యాక అయితే రికార్డ్ స్థాయిలో వ్యూస్ సంపాదించింది ఈ పాట. ఇప్పటికీ ఈ పాట హవా కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఫ్లోరిడాలో లాడర్ హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ అండ్ బ్రోవార్డ్ కంట్రీ స్టేడియంలో 'ఊ అంటావా' పాట ప్లే అయ్యింది. అంతే అక్కడ ఉన్నవారందిరిలో ఒక్కసారిగా ఊపొచ్చింది. ఈ పాటకు స్టె్ప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ పాట మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.


Next Story

RELATED STORIES