CRICKET: భారత బౌలర్లు ప్రమాదకరం ఏమీ కాదు: పాక్ ఆటగాడు అహ్మద్ షెజాద్

భారత అగ్రశ్రేణి బౌలర్లపై పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ షెహజాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ జట్టులో బుమ్రా, జడేజా, అశ్విన్ లాంటి మంచి బౌలర్లు ఉన్నారు కానీ వారెవ్వరూ, బ్యాట్స్‌మెన్‌ని భయపెట్టేంత స్థాయి బౌలర్లు కాదన్నాడు. ఇటీవల లండన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌లో బౌలర్ల పేలవ ప్రదర్శనతో టీమిండియా ఓటమిపాలయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్‌లో సమస్య ఉందని విమర్శించాడు. ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌పై ప్రశంసలు కురిపించాడు.
"భారత బ్యాటింగ్ లైనప్ ఎప్పటికీ ప్రమాదకరమే. వారినొక కంటకనిపెట్టుకుని ఉండాలి. అయితే బుమ్రా, జడేజా, రవిచంద్ర అశ్విన్ వంటి బౌలర్ల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. కానీ వారి బౌలింగ్ బౌలింగ్ మాత్రం అంత భయపెట్టేంతగా ఏమీ ఉండదు." అని తెలిపాడు.
ఇదే సందర్భంగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ నెట్స్‌లో ఎంత క్రమశిక్షణతో ఉండేవాడో గుర్తుకుచేసుకున్నాడు.
"షోయబ్ అక్తర్‌లో 2 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ప్రాక్టీస్ నెట్స్‌లో ఎప్పుడూ నో బాల్స్ వేయలేదు. అలాగే బ్యాట్స్‌మెన్ గాయపడతారని తెలిసి, వారిని భయపెట్టేలా అనవసరమైన బౌన్సర్లు వేయలేదు." అని వెల్లడించాడు.
గత 10 ఏళ్లుగా టీమిండియా ICC టోర్నీల్లో విఫలమవుతోంది. చివరిసారిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com