PAK TEAM: బాబర్, రిజ్వాన్ లేకుండానే పాకిస్థాన్ జట్టు

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్ కు ఆడే పాకిస్తాన్ జట్టు ను తాజాగా ప్రకటించింది పాకిస్తాన్ బోర్డ్. అయితే ఈ జట్టులో... డేంజర్ ఆటగాళ్లు బాబర్, మహమ్మద్ రిజ్వాన్‌లకు ఛాన్స్ ఇవ్వలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వాళ్ళిద్దరూ లేకుండానే జట్టును ప్రకటించింది. అంతేకాదు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ కెప్టెన్ గా సల్మాన్ అలీని ఫైనల్ చేశారు. మొత్తం 17 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు ఇద్దరు లేరు. బాబర్ అజాం, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు స్టార్ ప్లేయర్లను కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దూరం పెట్టింది. వాళ్లను లెక్కలోకి తీసుకోలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అంతేకాదు సల్మాన్ అలీ అఘా కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
ఇద్దరు ఆటగాళ్లకు షాక్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బాబర్ అలాగే రిజ్వాన్ లాంటి స్టార్ ప్లేయర్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దూరం పెట్టింది. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదు. చాలాసార్లు ఛాన్స్ ఇచ్చినప్పటికీ ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో మొన్నటి వరకు కెప్టెన్ గా ఉన్న బాబర్ పై వేటు వేసి రిజ్వాన్ కు కూడా కెప్టెన్సీ అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయినప్పటికీ పరిస్థితి మార్చుకోలేదు. ఫలితంగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బాబర్ అలాగే రిజ్వాన్‌లపై వేటు వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో తటస్థ వేదికల పైన ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 14వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొన్న యుద్ధం జరిగిన నేపథ్యంలో చాలా మంది సైనికులు అలాగే సామాన్య పౌరులు మరణించారు. అందుకే పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకుండా టీం ఇండియా నిర్ణయం తీసుకోవాలని చాలామంది మాజీ క్రికెటర్లు, హర్భజన్ లాంటివారు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ గ్రూప్‌స్టేజ్‌లోనే నిష్క్రమించింది. నాడు బాబర్ అజామ్, రిజ్వాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్నుంచి వీరిద్దరిని పీసీబీ పొట్టి ఫార్మాట్ నుంచి దూరంగా పెట్టింది. ఇటీవల ముగిసిన విండీస్‌తో టీ20 సిరీస్‌కూ ఎంపిక చేయలేదు. దీంతో వీరు ఆసియా కప్‌లో ఆడటం కష్టమేనని నాడు వార్తలు వచ్చాయి. అందుకు తగినట్టుగానే ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ స్క్వాడ్ : సల్మాన్ అలీ (c), అబ్రార్, ఫహీమ్, ఫఖర్, రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, తలత్, ఖుష్దిల్ షా, హరీస్ (WK), నవాజ్, వసీమ్ జూనియర్, ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్, సుఫ్యాన్ మొకిమ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com