Hockey: భారత్ చేరుకున్న పాక్ జట్టు

త్వరలో ప్రారంభమవనున్న ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి పాకిస్థాన్ జట్టు భారత్‌కు చేరుకుంది. అట్టారీ-వాఘా సరిహద్దు నుంచి భారత్‌లోకి వచ్చారు. ఆగస్టు 3 నుంచి 12 వరకు ఈ టోర్నీ జరగనుంది. పాక్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆసియాలోని టాప్ 6 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. 2011 సంవత్సరం నుంచి ఈ టోర్నీని ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నారు.
పాకిస్తాన్, భారత జట్లు జట్టు ఎక్కువగా 3 సార్లు ఈ టోర్నీని గెలుచుకుంది. 2012, 2013 సంవత్సరాల్లో పాకిస్థాన్ విజేతగా నిలవగా, 2012, 2013 సంవత్సరాల్లో భారత్ గెలిచింది. 2018 టోర్నీని ఇరుజట్టు పంచుకున్నాయి.2021 లో దక్షిణ కొరియా జట్టు టైటిల్ గెలిచింది.
"ఇతర దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ఆటలు తోడ్పడతాయి. చాలా ఆటలు నిర్వహించడం చాలా మంచింది. " అని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ మహ్మద్ ఉమర్ భుట్టా అన్నాడు.
పాకిస్థాన్ హాకీ కోచ్ మాట్లాడుతూ.. క్రీడలు, ఫిల్మ్ రంగం ద్వారా భారతదేశంతో మంచి సంబంధాలు నెలకొలకొంటాయన్నాడు. ఇరుదేశాల ప్రజలకు అతిథులను ఎలా గౌరవించాలో బాగా తెలుసన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com