Ayesha Naseem: 18 ఏళ్లకే పెద్ద నిర్ణయం, రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

Ayesha Naseem: 18 ఏళ్లకే పెద్ద నిర్ణయం, రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
18 ఏళ్లకే రిటైర్‌మెంట్ ప్రకటించిన పాక్‌ స్టార్ క్రికెటర్‌.... తన నిర్ణయం వెనుక విస్తుపోయే వాస్తవం...

పాకిస్తాన్‌((Pakistan Women Team) మహిళా స్టార్‌ క్రికెటర్‌ ఆయేషా నసీమ్‍(Ayesha Naseem) సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లకే రిటైర్‌మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. 15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని.. 18 ఏళ్లకే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన అయేషా ఏకంగా తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB)తో పాటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఈ వయసులోనే తమని తాము నిరూపించుకునేందుకు ఎక్కువ మంది క్రికెటర్లు తహతహలాడుతుంటారు. అయేషా మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.


చిన్న వ‌య‌సులోనే క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డానికి ఆయేషా నసీమ్‌ చెప్పిన కారణం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాను ఇస్లాం మతాచారాల((Islam Religion) ప్రకారం జీవించాలనుకుంటున్నానని, అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అయేషా వెల్లడించింది.ఇస్లాం మతానికి అనుగుణంగా తన జీవితాన్ని మరింత పవిత్రంగా జీవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపింది. 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అయేషా పాకిస్థాన్ మహిళల జట్టు తరపున నాలుగు వన్డేలు (ODI), 30 టీ20లు ఆడింది. 4 వన్‌డేలలో 33 పరుగులు చేసింది. ఇక పొట్టి ఫార్మాట్‌లో 369 పరుగులు చేసింది. అలవకోగా సిక్సర్లు కొట్టడంలో దిట్ట అయిన అయేషా అనతికాలంలోనే పాకిస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారింది.


2020లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. పాక్‌ తరఫున 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆమె 400కు పైగా పరుగులు చేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో తన చివరి మ్యాచ్‌ ఆడింది. 20 బంతుల్లో 24 పరుగులు చేసింది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో పుట్టిపెరిగిన అయేషాకు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. తన కష్టం, ఇష్టానికి తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో 15 ఏళ్లకే పాకిస్తాన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 15వ ఏట ఐసీసీ ఉమెన్స్ టీ20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తరఫున బరిలోకి దిగింది. ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్న అయేషా రిటైర్మెంట్ ప్రకటించడం పాక్ మహిళా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఈజీగా ఫోర్లు, సిక్సర్లు బాదే ఆమె టీ20 జట్టులో లేకపోవడం పాకిస్తాన్‌కు నష్టం చేకూర్చేదేనని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story