Sl vs Pak Test: పాక్‌ని ఆదుకున్న షకీల్, ఆఘాలు

Sl vs Pak Test: పాక్‌ని ఆదుకున్న షకీల్, ఆఘాలు
X
పాక్ మొదటి ఇన్సింగ్స్‌--> 221/5 శ్రీలంక మొదటి ఇన్సింగ్స్‌--> 312 ఆలౌట్

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లు షకీల్(69), ఆఘా(61)లు అజేయంగా అర్ధసెంచరీలతో రాణించడంతో పాక్ మ్యాచ్‌లో నిలిచింది. మొదటి ఇన్సింగ్స్‌లో శ్రీలంక 312 పరుగులకు ఆలౌట్ అయింది.

242 పరుగులతో 2వ రోజుని ఆరంభించింది శ్రీలంక. ధనంజయ డిసిల్వా 175 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో ఇది అతడికి 10వ టెస్ట్ సెంచరీ. నెమ్మదిగా ఆడిన రమేష్ మెండిస్(5) స్పిన్నర్ అహ్మద్ బౌలింగ్‌లో స్లిప్‌లో దొరికిపోయాడు. తర్వాత వచ్చిన జయసూర్యని నసీం ఔట్ చేశాడు. నసీం తన తరువాతి ఓవర్లోనే సెంచరీ చేసిన ధనంజయను పెవిలియన్ పంపాడు. శ్రీలంక ఆటగాళ్లు రజిత, విశ్వాలు బౌండరీలు, సిక్సులతో స్కోర్ వేగం పెంచారు. కసన్ రజిత అహ్మద్ బౌలింగ్‌లో ఔటై చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.


లంచ్ తర్వాత ఇన్సింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ని శ్రీలంక బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో కట్టడి చేశారు. మొదటి ఓవర్లోనే ఓపెనర్ అబ్ధుల్లా, విశ్వా యార్కర్‌కి ఎల్బీ నుంచి బతికిపోయాడు. కానీ ఇన్సింగ్స్ 2వ ఓవర్లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ క్యాచ్‌ ఔటై వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన షాన్, అబ్ధుల్లాలు ఓవర్‌కి బౌండరీ కొడుతూ స్ట్రైక్ రొటేట్ చేశారు.

10 ఓవర్ల తర్వాత పాక్‌ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కి వరుసగా క్యూ కట్టారు. 11వ ఓవర్లో జయసూర్య బౌలింగ్‌లో అబ్ధుల్లా డిఫెన్స్ ఆడబోగా, బ్యాట్‌కు తగిలిన బంతిని స్లిప్‌లో ఉన్న ధనంజయ అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. తరువాతి ఓవర్లోనే పాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.క్రీజులో కుదురుకన్న షాన్ మసూద్‌ని రమేష్ మెండిస్‌ని ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో 12 ఓవర్లో 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్లో పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజామ్‌ కూడా ఔటై వెనుదిరిగాడు. మరో 6 ఓవర్ల తర్వాత పాక్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. అప్పటికీ పాక్ స్కోర్ 101 పరుగులు మాత్రమే. ఈ దశలో పాక్ 200 పరుగులైనా చేస్తుందా అన్పించింది.

క్రీజులోకి వచ్చిన పాక్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. టీ విరామం తర్వాత గేర్లు మార్చిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ క్రీజు వదిలి వచ్చి ఆడుతూ బౌండరీలతో స్కోర్‌ని 200 దాటించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని పాక్‌ని ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లలో జయసూర్య 3 వికెట్లు తీశాడు. వర్షం ఆటంకం కలిగించడంతో ఆటని మధ్యలోనే ఆపేశారు.


Tags

Next Story