Sucide: ప్రాణాలు తీసుకున్న పాకిస్థాన్ స్నూకర్ ప్లేయర్

డిప్రెషన్‌తో సతమతమవుతూ పాకిస్థాన్‌కి చెందిన స్నూకర్ ఆటగాడు ఆత్మహత్య చేసుకున్నాడు. పాకిస్థాన్‌కి చెందిన 28 యేళ్ల యువ స్నూకర్ ప్లేయర్ మాజిద్ అలీ మానసికంగా ఒత్తిడితో కలపను తొలిచే యంత్రం రంపంతో ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. గురువారం పంజాబ్‌లో ఫైసలాబాద్‌కి సమీపంలోని తన స్వస్థలం సముంద్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చాలా సంవత్సరాల నుంచి, తన టీనేజ్ నుంచే ఈ సమస్యతో బాధపడుతున్నట్లు సోదరుడు వెల్లడించాడు. ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని వెల్లడించారు. గత నెలలో మరో అంతర్జాతీయ స్నూకర్ ప్లేయర్, మహమద్ బిలాల్ గుండెపోటుతో మరణించడం గమనార్హం.
28 యేళ్ల మాజిద్ అలీ ఆసియా అండర్-21 స్నూకర్ విభాగంలో రజక పతకం సాధించాడు. పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటూ ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చాడు. జాతీయస్థాయిలో ఉన్న కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు.
అతని సోదరుడు ఉమర్ మాట్లాడుతూ.. మాజిద్ ఆత్మహత్య మమ్మల్ని భయభ్రాంతుల్ని చేసింది. ఎందుకంటే తను ప్రాణాలు తీసుకుంటాడని తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మాజిద్ ప్రతిభ కలిగిన ఆటగాడని, పాకిస్థాన్‌కు మరిన్ని పతకాలు తెస్తాడని ఆశించామని పాకిస్థాన్ బిలియర్డ్స్, స్నూకర్ ఛైర్మన్ అలాంగిర్ షైక్ తెలిపారు. ఆటగాళ్లు అంతా మాజిద్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారని వెల్లడించారు.
పాకిస్థాన్‌లో స్నూకర్ ఉన్నత స్థాయిలో ఆడే ఆటగా మారింది. పాక్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్, మహమ్మద్ ఆసిఫ్ వంటి స్లార్లు ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్నారు. పలువురు ఆటగాళ్లు ప్రొఫెనల్ సర్క్యూట్‌కి అర్హత సాధిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com