Cricket: వరల్డ్‌కప్‌కి ముందు పాకిస్థాన్ కీలక పర్యటన

బాబర్ ఆజాం సారథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. 2024లో T20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో దాని కన్నా ముందే ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు సన్నాహకంగా 4 మ్యాచ్‌ల T20 సిరీస్ కోసం ఇరు బోర్డులు అంగీకారం కుదుర్చుకున్నాయి. 2024 సంవత్సరం మేలో ఈ పర్యటన ఉండనుంది.
మే 22న లీడ్స్‌లో మొదటి T20తో ఈ సిరీస్ ఆరంభమవనుంది. మే 25న బర్మింగ్‌హాంలో 2వ మ్యాచ్, కార్డిఫ్‌లో మే 28న మూడవ మ్యాచ్, 4వ టీ20 మే 30న ఓవల్‌లో జరగనున్నాయి. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్లు వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కి పయనమవుతాయి.
అయితే 2022 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఇంగ్లాండ్‌కి పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చింది. 7 మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు పాక్‌ను 4-3 మ్యాచ్‌ల తేడాతో ఓడించింది. అనంతరం జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఈ జట్లే తలపడ్డారు. ఫైనల్లో పాకిస్థాన్‌ని ఇంగ్లాండ్ ఓడించి వరల్డ్‌కప్ గెలిచింది. ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చే జట్టు ఇంగ్లాండ్ అయింది.
ఇంగ్లాండ్‌తో ఈ సిరీస్ కంటే ముందే పాకిస్థాన్ జట్టు ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లో పర్యటించనుంది. ఆ పర్యటన వివరాలు తర్వాత ప్రకటించనున్నారు.
షెడ్యూల్ ఇదే..
4 మ్యాచ్‌ల టీ20 సిరీస్
==> తొలి T20- మే 22- హెడింగ్లీ, లీడ్స్
==> రెండో T20- మే 25- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హాం
==> మూడో T20- మే 28- సోఫియా గార్డెన్స్, కార్డిఫ్
==> నాలుగో T20- మే 30- ఓవల్, లండన్
వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ స్వదేశంలో వెస్టిండీస్ ( జులై 10-30 ), శ్రీలంక( ఆగస్ట్ 21- సెప్టెంబర్ 10 ) జట్లకు టెస్ట్ సిరీస్‌కు ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా జట్టుతో 3 టీ20లు, 5 వన్డేల్లో తలపడనుంది.
పురుషుల క్రికెట్‌కి సమాంతరంగానే ఇంగ్లాండ్, పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ద్వై పాక్షిక సిరీస్ ఖరారైంది. ఈ పర్యనలో ఇరుజట్లు 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com