pant: ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పంత్ అవుట్

pant: ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పంత్ అవుట్
X

టీ­మిం­డి­యా వి­కె­ట్ కీ­ప­ర్ రి­ష­బ్ పంత్ ఇం­గ్లాం­డ్ సి­రీ­స్ నుం­చి వై­దొ­లి­గా­డు. గాయం కా­ర­ణం­గా సి­రీ­స్‎­లో చి­వ­రి­దైన ఐదో టె­స్ట్‎­కు పంత్ దూ­ర­మై­న­ట్లు బీ­సీ­సీఐ అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చిం­ది. ఈ మే­ర­కు బీ­సీ­సీఐ ఒక ప్ర­క­టన వి­డు­దల చే­సిం­ది. ‘‘మాం­చె­స్ట­ర్‌­లో ఇం­గ్లాం­డ్‌­తో జరి­గిన నా­ల్గవ టె­స్ట్ సం­ద­ర్భం­గా రి­ష­బ్ పంత్ గా­య­ప­డ్డా­డు. పంత్ కుడి పాదం ఫ్రా­క్చ­ర్ కా­వ­డం­తో సి­రీ­స్‌ చి­వ­రి టె­స్ట్‌­కు దూ­ర­మ­య్యా­డు. బీ­సీ­సీఐ వై­ద్య బృం­దం అతని పు­రో­గ­తి­ని పర్య­వే­క్షి­స్తుం­ది. పంత్ త్వ­ర­గా కో­లు­కో­వా­ల­ని కో­రు­కుం­టు­న్నాం’’ అని బీ­సీ­సీఐ పే­ర్కొం­ది. కాగా పంత్ స్థా­నా­న్ని తమి­ళ­నా­డు వి­కె­ట్ కీ­ప­ర్ జగ­దీ­శ­న్‎­తో భర్తీ చే­సి­న­ట్లు బీ­సీ­సీఐ తె­లి­పిం­ది. ది ఓవల్ వే­ది­క­గా జర­గ­ను­న్న చి­వ­రి టె­స్టు­లో పంత్ స్థా­నం­లో జగ­దీ­శ­న్ ను బీ­సీ­సీఐ సె­ల­క్ట్ చే­సిం­ది.

జట్టు కష్టా­ల్లో ఉం­డ­టం­తో గా­యా­న్ని కూడా లె­క్క చే­య­కుం­డా ఓ పో­రాట యో­ధు­డి­లా తి­రి­గి బ్యా­టిం­గ్‎­కు వచ్చి అం­ద­రి చేత ప్ర­శం­స­లు అం­దు­కు­న్నా­డు పంత్. కాలు ఫ్రా­క్చ­ర్ కా­వ­డం­తో తి­రి­గి కో­లు­కో­వ­డా­ని­కి 6 నుం­చి 8 వా­రాల సమయం పడు­తుం­ద­ని డా­క్ట­ర్లు చె­ప్ప­డం­తో పంత్ చి­వ­రి టె­స్టు­కు దూ­ర­మ­య్యా­డు. ఈ సి­రీ­స్‎­లో అద్భు­త­మైన ఫా­మ్‎­లో ఉన్న పంత్ భా­ర­త్‎­కు కీ­ల­క­మైన ఐదో టె­స్టు­కు దూరం కా­వ­డం టీ­మిం­డి­యా­కు ఎదు­రు దె­బ్బ­నే­న­ని అం­టు­న్నా­రు క్రీ­డా వి­శ్లే­ష­కు­లు. నా­లు­గో టె­స్టు డ్రా కా­వ­డం­తో ఇక అయి­దో టె­స్టు చాలా కీ­ల­కం­గా మా­రిం­ది. ఈ మ్యా­చు­లో గె­లి­చి సి­రీ­స్ సమం చే­యా­ల­ని టీ­మిం­డి­యా పట్టు­ద­ల­గా ఉంది.

Tags

Next Story