WTC: రసకందాయంలో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌

WTC: రసకందాయంలో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌
X
దాదాపు పట్టు బిగించిన ఆస్ట్రేలియా... పోరాడుతున్న సఫారీలు

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల హవా కొనసాగుతుండటంతో మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫలితం తేలేలా ఉంది. 43/4తో రెండో రోజును ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. పాట్ కమిన్స్ (6/28) విజృంభించడంతో 138 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (43; 50 బంతుల్లో 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ స్టార్క్ (16*), నాథన్ లైయన్ (1*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 218 ఆసీస్‌ పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 74 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. మార్నస్ లబుషేన్ (22), స్టీవ్ స్మిత్ (13) పరుగులు చేశారు. ఉస్మాన్ ఖవాజా (6), కామెరూన్ (0)లను రబాడ తొలి ఇన్నింగ్స్‌ మాదిరే ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. ట్రావిస్ హెడ్ (9), బ్యూ వెబ్‌స్టర్ (9), పాట్ కమిన్స్ (6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో ఆసీస్ 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 100లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, అలెక్స్ కేరీ, స్టార్క్ క్రీజులో నిలదొక్కుకుని ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, రబాడ 3, యాన్సెన్, ముల్డర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.**

లార్డ్స్‌లో రికార్డ్ సృష్టించిన కమ్మిన్స్

క్రికెట్ మక్కా 'లార్డ్స్'లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు. లార్డ్స్ వేదికలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన కెప్టెన్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న WTC ఫైనల్‌లో కమ్మిన్స్.. కేవలం 28 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి ఈ ఫీట్‌ని సాధించాడు. అంతకు ముందు బాబ్ విల్లిస్(6-101), అల్లెన్(5-35, 5-42), వెట్టోరి(5-69) పేర్ల మీద ఈ రికార్డ్ ఉండేది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. తన అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్లు పడగొట్టిన అతను టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన నాల్గవ బౌలర్‌గా నిలిచాడు.

Tags

Next Story