క్రీడలు

రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మహత్య..

ప్రసిద్ధ ఫోగాట్ కుటుంబంలో భాగమైన రితిక రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ మహిళలు మరియు పురుషుల కుస్తీ టోర్నమెంట్‌లో ఆడుతున్నారు.

రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మహత్య..
X

భారత రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మహత్యకు పాల్పడింది. గీతా, బబితా ఫోగాట్‌ల కజిన్ సోదరి అయిన రితిక మార్చి 17 న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. రితిక ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు రావడంతో భారత రెజ్లింగ్ అభిమానులు గురువారం తీవ్ర షాక్‌కు గురయ్యారు.

ప్రసిద్ధ ఫోగాట్ కుటుంబంలో భాగమైన రితిక రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ మహిళలు మరియు పురుషుల కుస్తీ టోర్నమెంట్‌లో ఆడుతున్నారు. మార్చి 14 న ఆడిన ఫైనల్లో1 పాయింట్ తేడాతో రితికా ఓడిపోయింది. దాంతో ఆ రోజు నుంచి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సన్నిహితులు భావిస్తున్నారు.

రితిక ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ సింగ్ ఫోగాట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. రాజస్థాన్‌లోని జైత్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న రితిక, హర్యానాలోని మహావీర్ ఫోగట్ స్పోర్ట్స్ అకాడమీలో ఐదేళ్లుగా కుస్తీ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తోంది.

రితిక మృతిపై దర్యాప్తు ప్రారంభించినట్లు హర్యానాకు చెందిన చార్కి దాద్రి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రామ్ సింగ్ బిష్ణోయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

"బబితా ఫోగాట్ కజిన్ అయిన రితికా మార్చి 17 న ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి కారణం రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన రెజ్లింగ్ టోర్నమెంట్‌లో ఆమె ఓటమి కావచ్చు. దర్యాప్తు జరుగుతోంది" అని రామ్ సింగ్ బిష్ణోయ్ చెప్పారు.

"అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్న రితికా ఫోగాట్‌ను కోల్పోయాము. కొన్ని దశాబ్దాల క్రితం అథ్లెట్లకు ఒత్తిళ్లు లేవు. ప్రస్తుతం ఆటగాళ్లు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. వారి శిక్షణలో ముఖ్యమైన భాగం ఒత్తిళ్లను ఎదుర్కోవడం కూడా"అని సింగ్ ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES