క్రీడలు

Piyush Chawla : పీయూష్‌ చావ్లా ఇంట తీవ్ర విషాదం..!

Piyush Chawla : కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్‌ చావ్లా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Piyush Chawla : పీయూష్‌ చావ్లా ఇంట తీవ్ర విషాదం..!
X

Piyush Chawla : టీంఇండియా మాజీ క్రికెటర్ పీయూష్‌ చావ్లా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రమోద్‌ కుమార్‌ చావ్లా తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్‌ చావ్లా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ''ఆయన లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. పరిస్థితులు ఇంతకు ముందులా ఉండబోవు. నా అండను కోల్పోయాను'' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. పియూష్‌ చావ్లా తండ్రి మృతి పట్ల మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా సంతాపం ప్రకటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. కాగా పీయూష్‌ ను ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం 2.40 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం అతనికి దక్కలేదు.

Next Story

RELATED STORIES