PKL: వైభవంగా ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్

PKL: వైభవంగా ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్
X
విశాఖలో ప్రొ కబడ్డీ లీగ్ 12 సీజన్ ప్రారంభం... హాజరైన క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ... తొలి మ్యాచ్‌లో ఓడిన తెలుగు టైటాన్స్

వి­శాఖ వే­ది­క­గా ప్రొ కబ­డ్డీ లీగ్ 12వ సీ­జ­న్ ఘనం­గా ప్రా­రం­భ­మైం­ది. వి­శా­ఖ­లో­ని రా­జీ­వ్ గాం­ధీ ఇం­డో­ర్ స్టే­డి­యం­లో ఏర్పా­టు చే­సిన ప్రా­రం­భో­త్సవ వే­డు­క­కు భారత క్రి­కె­ట్‌ యువ సం­చ­ల­నం 14 ఏళ్ల వై­భ­వ్‌ సూ­ర్య­వం­శీ ప్ర­త్యేక అతి­థి­గా హా­జ­ర­య్యా­డు. ప్రొ కబ­డ్డీ లీగ్ 12 సీ­జ­న్ ప్రా­రం­భా­ని­కి ముం­దే.. కబ­డ్డీ మ్యా­ట్‌­పై క్రి­కె­ట్ ఆడా­డు. ఆ తర్వాత ఆట­గా­ళ్ల­తో కలి­సి కా­సే­పి కబ­డ్డీ కూడా ఆడా­డు. అనం­త­రం 14 ఏళ్ల వై­భ­వ్‌ సూ­ర్య­వం­శీ చే­తుల మీ­దు­గా ఈవెం­ట్‌ లాం­చ్‌ అయ్యిం­ది. ఇక ఇదే కా­ర్య­క్ర­మం­లో కబ­డ్డీ ది­గ్గ­జం.. అభి­మా­ను­లు డు­బ్కీ కిం­గ్‌­గా పి­లు­చు­కు­నే పర్దీ­ప్ నర్వా­ల్‌­ను సన్మా­నిం­చా­రు. ప్రొ కబ­డ్డీ లీగ్ చరి­త్ర­లో­నే పర్దీ­ప్ నర్వా­ల్‌ 1801 రై­డ్‌ పా­యిం­ట్లు సా­ధిం­చి.. అత్య­ధిక రై­డ్‌ పా­యిం­ట్లు సా­ధిం­చిన ఆట­గా­డి­గా ని­లి­చా­డు. ఈ సం­ద­ర్భం­గా వై­భ­వ్‌ మా­ట్లా­డు­తూ.. క్రీ­డ­లు మనకు క్ర­మ­శి­క్షణ, టీ­మ్‌­వ­ర్క్ నే­ర్పి­స్తా­యి. నే­ష­న­ల్ స్పో­ర్ట్స్ డే నాకు స్పూ­ర్తి­దా­య­కం అని వ్యా­ఖ్యా­నిం­చా­డు.


తెలుగు టైటాన్స్ ఓటమి

ప్రో కబ­డ్డీ సీ­జ­న్ 12ను తె­లు­గు టై­టా­న్స్‌ ఓట­మి­తో ఆరం­భిం­చిం­ది. చి­వ­రి వరకూ ఉత్కంఠ భరి­తం­గా సా­గిన మ్యా­చ్‌­లో కే­వ­లం 3 పా­యిం­ట్ల తే­డా­తో తె­లు­గు టై­టా­న్స్... తమి­ళ్ తలై­వా­స్ చే­తి­లో పరా­జ­యం పా­లైం­ది. ఈ మ్యా­చు­లో 35-38 పా­యిం­ట్ల తే­డా­తో తె­లు­గు­టై­టా­న్స్ ఓడి­పో­యిం­ది. తమి­ళ్ తలై­వా­స్‌ జట్టు­లో అర్జు­న్ దే­శ్‌­వా­ల్‌ చె­ల­రే­గి­పో­యా­డు. 12 పా­యిం­ట్లు సా­ధిం­చి తమి­ళ్ తలై­వా­స్ వి­జ­యం సా­ధిం­చ­డం­లో కీలక పా­త్ర పో­షిం­చా­డు. తె­లు­గు టై­టా­న్స్‌­లో భరత్ 11 పా­యిం­ట్లు సా­ధిం­చి పో­రా­డి­నా అత­ని­కి మద్ద­తు కరు­వైం­ది. తర్వా­తి మ్యా­చు­లో జై­పు­ర్​­లో (సె­ప్టెం­బ­రు 12 నుం­చి 28), చె­న్నై (29 నుం­చి అక్టో­బ­రు 10 వరకు), అలా­గే ది­ల్లీ­లో (అక్టో­బ­రు 11 నుం­చి 23 వరకు ) వరకు మ్యా­చ్​­లు జరు­గు­తా­యి.

బలంగా ఉన్నా తప్పని ఓటమి

తె­లు­గు టై­టా­న్స్‌ జట్టు అన్ని వి­భా­గా­ల్లో బలం­గా ఉం­ద­ని తె­లు­గు టై­టా­న్స్ కె­ప్టె­న్ వి­జ­య్​­మా­లి­క్ పే­ర్కొ­న్నా­డు. డి­ఫెం­డ­ర్లు అజి­త్‌ పాం­డు­రంగ పవా­ర్, అం­కి­త్, అవి దు­హా­న్, బంటు, శు­భ­మ్‌ షిం­డే, అమ­న్‌ రా­హు­ల్‌ దగా­ర్‌ ప్ర­త్య­ర్థు­ల­ను కట్ట­డి చే­సేం­దు­కు సి­ద్ధం­గా ఉన్నా­రు. జట్టు­లో శం­క­ర్‌ భీ­మ­రా­జ్, భరత్, గణే­ష్‌ అద్భుత ప్ర­ద­ర్శ­న­తో ఆల్‌­రౌం­డ­ర్లు తమ సత్తా చా­ట­ను­న్నా­రు. రై­డ­ర్లు చే­త­న్‌ సాహు, ని­తి­న్, రో­హి­త్, ప్ర­ఫు­ల్, జై­భ­గ­వా­న్, ఆశీ­ష్‌ పా­యిం­ట్లు తె­చ్చి జట్టు­కు బలం­గా తో­డ్పా­టు అం­దిం­చ­ను­న్నా­రు. ప్ర­తి మ్యా­చ్‌­లో వి­జ­య­మే లక్ష్యం­గా పోటీ పడి, ట్రో­ఫీ సా­ధిం­చేం­దు­కు ఐక్యం­గా కృషి చే­స్తా­మ­ని చె­ప్పా­రు.

Tags

Next Story