ప్రపంచ కప్ టిక్కెట్లను అడక్కండి ప్లీజ్.. స్నేహితులను అభ్యర్థించిన విరాట్ అనుష్క

ప్రపంచ కప్ టిక్కెట్లను అడక్కండి ప్లీజ్.. స్నేహితులను అభ్యర్థించిన విరాట్ అనుష్క
చూడముచ్చటైన జంట అనుష్క, విరాట్ కోహ్లీ. క్రికెట్ ప్రియులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ గురించి విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.

చూడముచ్చటైన జంట అనుష్క, విరాట్ కోహ్లీ. క్రికెట్ ప్రియులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ గురించి విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా ఓ పోస్ట్ పెట్టాడు. కోహ్లీ తన స్నేహితులను ప్రపంచ కప్ టిక్కెట్లు అడగవద్దని అభ్యర్థించాడు, మ్యాచ్ ను ఇంటి నుంచే చూసి ఆస్వాదించమని సూచించాడు. అయితే కోహ్లి సందేశాన్ని మళ్లీ పోస్ట్ చేసిన అనుష్క శర్మ సరదాగా టిక్కెట్ల గురించి విరాట్ స్పందించకపోతే సహాయం చేయమని నన్ను అభ్యర్థించకండి. అర్థం చేసుకునందుకు మీకు ధన్యవాదములు'. టికెట్ రిక్వెస్ట్‌ల జోలికి పోకుండా టోర్నీపైనే దృష్టి పెట్టాలని ఇద్దరూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతలో, కోహ్లి ఇటీవల "వ్యక్తిగత కారణాలను" పేర్కొంటూ ముంబైకి వెళ్లడం మీడియా కంట పడింది. అనుష్క, కోహ్లి తమ రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారనే వార్తల మధ్య అతని ముంబై పర్యటన ముఖ్య వార్త అయింది. ఈ జంట అధికారికంగా శుభవార్త ప్రకటించనప్పటికీ, నటి ఇప్పటికే మూడో నెల ప్రెగ్నెన్సీ అని అనేక నివేదికలు వైరల్ అయ్యాయి. మొదటి బిడ్డ వామికను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతోంది ఈ జంట. అనుష్క పెళ్లి, బిడ్డ పుట్టిన తరువాత సినిమాలు తగ్గించుకుంది. ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా తాను పెళ్లి తరువాత సినిమా కెరీర్ కు స్వస్తి చెబుతానని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story