టీమిండియా హాకీ కెప్టెన్‎తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. వీడియో వైరల్

టీమిండియా హాకీ కెప్టెన్‎తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. వీడియో వైరల్
Manpreet Singh and PM Modi: ఒలింపిక్స్‌లో జ‌ర్మనీతో జ‌రిగిన కాంస్య పతాకం పోరులో మ్యాచ్‌లో నెగ్గిన భార‌త జ‌ట్టుకు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు.

Manpreet Singh and PM Modi: టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌ పురుషుల హాకీ టీం చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌ కాంస్య పతాకం పోరులో మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన జయకేతనం ఎగరేసింది. ఒలింపిక్స్‌లో జ‌ర్మనీతో జ‌రిగిన కాంస్య పతాకం పోరులో మ్యాచ్‌లో నెగ్గిన భార‌త జ‌ట్టుకు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. భారత జ‌ట్టుతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఆయ‌న కెప్టెన్ మ‌న్‌ప్రీత్ సింగ్‌కు ఫోన్ చేశారు. చాలా అద్భుతంగా ఆడారంటూ ఆటగాళ్లను మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీతో మాట్లాడిన మన్ ప్రీత్ మీ ఆశీస్సులు మ‌మ్మల్నీ గెలిపించయాని తెలిపారు.

టీమిండియా మెన్స్ జట్టు సెమీస్ చేరిన తర్వాత మోదీ ఫోన్ చేశారు. ఆ విష‌యాన్ని మ‌న్‌ప్రీత్ గుర్తు చేస్తూ.. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మేము పతాకం గెలచామని తెలిపారు. భార‌త కోచ్ గ్రహ‌మ్ రీడ్‌, అసిస్టెంట్ కోచ్ పీయూష్ దూబేల‌తోనూ మోదీ మాట్లాడారు. వారిని ఆయ‌న అభినందించారు. మోదీ ఫోన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టగ్‌ ఆఫ్‌ వార్‌గా భావించిన పోరులో జర్మనీని 5-4 తేడాతో ఓడించింది. 41ఏళ్ల తర్వాత తర్వాత ఒలింపిక్‌ పతకాన్ని ఖాతాలో వేసుకుంది.


Tags

Read MoreRead Less
Next Story