IPL: గుజరాత్ జైత్రయాత్రకు లక్నో బ్రేక్

IPL: గుజరాత్ జైత్రయాత్రకు లక్నో బ్రేక్
X
లక్నో హ్యాట్రిక్ విజయం..మార్‌క్రమ్ మెరుపులు

ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్రకు లక్నో సూపర్ జెయింట్స్ బ్రేక్ వేసింది. శనివారం జరిగిన డబల్ ధమాకాలో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. తొలుత టాస్ గెలిచిన సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్దిష్ట 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా దిగ్వేష్ రతి, అవేష్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లక్నో 19.3 ఓవర్‌లోనే టార్గెట్ ఫినిష్ చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ రెండ్ వికెట్లు పడగొట్టగా రషీద్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.

మార్‌క్ర‌మ్‌ మెరుపులు

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ పై ఛేజింగ్ లో మార్‌క్ర‌మ్‌తో కలిసి కెప్టెన్ పంత్ ఓపెనర్ గా బరిలో దిగాడు. మిచెల్ మార్ష్ ఇంజూరీతో మ్యాచ్ కు దూరమవడంతో పంత్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. కానీ మళ్లీ (18 బంతుల్లో 21) ఫెయిలయ్యాడు.పూరన్‌ బాదుడు షురూ చేశాడు. ఈ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు మరోసారి సిక్సర్లతో చెలరేగాడు. రషీద్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలైన అతడి జోరు..సాయి కిశోర్‌ వేసిన పదో ఓవర్లో తారాస్థాయికి చేరింది. ఈ ఓవర్లో పూరన్‌ మూడు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో లఖ్‌నవూకు 24 పరుగులు వచ్చాయి. మార్‌క్రమ్‌ కూడా దూకుడుగా ఆడడంతో 11 ఓవర్లకు 123/1తో లఖ్‌నవూ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. మార్‌క్రమ్‌ను ప్రసిద్ధ్‌ ఔట్‌ చేసినా.. పూరన్‌ తగ్గలేదు. 23 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. అయితే పూరన్‌ వెనుదిరిగినా.. లక్ష్యం చేరువగా ఉండడంతో ఎల్‌ఎస్‌జీకి ఇబ్బంది లేకపోయింది. సమద్‌ (2 నాటౌట్‌)తో కలిసి బదోని (28 నాటౌట్‌; 20 బంతుల్లో 2×4, 1×6) పని పూర్తి చేశాడు.

ఓపెనర్లు ధనాధన్

ఈ మ్యాచ్‌లో గుజరాత్, లక్నో ఓపెనర్లు ధనాధన్ మెరుపులతో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. మొదటగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ మరోసారి అద్భుతమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మ‌న్ గిల్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 60 పరుగులు చేసి మెరిశాడు. లక్నో బ్యాటర్లలోను ఓపెనర్ ఐడెన్ మార్క్‌రమ్ 31 బంతుల్లోనే 9 ఫోర్లు, 1 సిక్సర్ బాది 58 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కెప్టెన్ పంత్(21) పర్వాలేదనిపించాడు. కాగా, లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్(61) మెరుపు ఇన్నింగ్స్‌తో దాదాపు గెలుపు లాంఛనాలను పూర్తి చేస్తున్న క్రమంలో రషీద్ ఖాన్ మ్యాజికల్ స్పెల్‌తో వెనక్కి పంపాడు. దీంతో ఆయుష్ బడోని(28*) ఆ లాంఛనాలను పూర్తి చేశాడు.

Tags

Next Story