Telangana : గుర్తింపు లేదని క్రీడాకారిణి కంటతడి.. ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రులు..

Telangana : గుర్తింపు లేదని క్రీడాకారిణి కంటతడి.. ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రులు..
Telangana : క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని కంటనీరు పెట్టుకున్నారు ప్రముఖ పవర్ లిప్టింగ్ చాంపియన్ మల్లిక.

Telangana : పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని కంటనీరు పెట్టుకున్నారు ప్రముఖ పవర్ లిప్టింగ్ చాంపియన్ మల్లిక. ప్రాణాలకు తెగించి తాను కేరళలోని కోయంబత్తూర్ లోజరిగిన ఏషియన్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌పోటీల్లో సత్తాచాటి స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ కైవనం చేసుకున్నా .. తమకు గుర్తింపులేదుని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ క్రీడాకారిణి మల్లికను ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని క్రీడల శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ హామి ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి పదిలక్షల ఆర్ధిక సహాయంతోపాటు... ఇంటిస్థలం మంజూరు చేయించేందుకుకృషి చేస్తామన్నారు. క్రీడాకారిని మల్లిక కంటనీరు పెట్టుకోవడంపై స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించారు.

తనవంతుగా రెండులక్షల సహాయం అందించారు. స్థానిక ఎంపి రంజిత్ రెడ్డి సైతం తమ వంతుగా రెండులక్షల ఆర్ధికసహాయం అందించి... ఆమెను మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో మల్లికను సత్కరించి మంత్రి.. పదిలక్షల రూపాయలతోపాటు.. ఇంటిస్థలంఇస్తామని మాట ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story