U20 World Champion: ప్రియా స్వర్ణ సంబరం

ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్(U20 World Champion)లో ప్రియా మాలిక్(Priya Malik ) సర్ణంతో అదరగొట్టింది. మహిళల 76 కిలోల ఫైనల్లో ప్రియ 5-0తో జర్మనీకి చెందిన లారా సెవ్లీ(Germany's Laura Celive Kuehn 5-0)ని మట్టికరిపించింది. ప్రియ దూకుడైన ఆటముందు లౌరా నిలువలేకపోయింది. అద్భుత ఆటతీరుతో ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గిన రెండో భారత మహిళా రెజ్లర్(only second Indian U20 World Champion)గా ప్రియ రికార్డు సృష్టించింది. గతేడాది అంతిమ్ పంఘాల్(Antim Panghal ) ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ అంతిమ్ ఫంగాల్ పసిడికి అడుగు దూరంలో నిలిచింది. ఈ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు దూసుకెళ్లింది. 53 కేజీల సెమీఫైనల్లో అంతిమ్ 12-0తో రష్యాకు లుకీనా పొలీనాను చిత్తు చేసింది. అంతిమ్ కుందు కూడా 65 కేజీలో విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆమె 7-5తో రష్యాకు చెందిన ఎక్తరీనా కొష్‌కీనాపై విజయం సాధించింది. 62 కేజీల విభాగంలో సవిత కూడా పసిడి పోరుకు అర్హత సాధించింది. 72 కేజీల విభాగంలో సెమీస్‌లో ఓడిన హర్షిత కాంస్యం కోసం పోరాడనుంది. రీనా కూడా పతక పోరుకు అర్హత సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com