PUJARA: పుజారా... ఓ పోరాట యోధుడు

PUJARA: పుజారా... ఓ పోరాట యోధుడు
X
టెస్టు క్రికెట్ పర్యాయపదం చతేశ్వర్ పుజారా

పు­జా­రా సవా­ళ్ల­కు ఎదు­రు ని­లి­చే రకం. భయం­కర బౌ­ల­ర్ల­నూ ప్ర­శాం­తం­గా ఎదు­ర్కొ­నే వీ­రు­డు అతను. అతను అడి­లై­డ్‌­లో 123తో సి­రీ­స్‌­ను ప్రా­రం­భిం­చా­డు, సి­డ్నీ­లో 193తో ము­గిం­చా­డు. ఆ బో­ర్డ­ర్-గా­వ­స్క­ర్ ట్రో­ఫీ­ని అం­దు­కు­న్న తర్వాత మొ­త్తం జట్టు ఎస్సీ­జీ అవు­ట్‌­ఫీ­ల్డ్‌­లో పు­జా­రా డ్యా­న్స్ చే­సిం­ది. మళ్ళీ ఇం­డి­యా­లో నా­లు­గు టె­స్ట్ సి­రీ­స్ కొ­న­సా­గు­తు­న్న­ప్పు­డు సీ­ని­య­ర్ ఆట­గా­ళ్ల వి­కె­ట్లు టప­ట­పా పడి­పో­యా­యి. కానీ పు­జా­రా మళ్లీ క్రీ­జు­లో పా­తు­కు­పో­యా­డు.

సచిన్, గవాస్కర్‌కు సాధ్యం కానీ రికార్డ్..

సు­నీ­ల్ గవా­స్క­ర్, సచి­న్ టెం­డూ­ల్క­ర్, రా­హు­ల్ ద్ర­వి­డ్, వి­రా­ట్ కో­హ్లీ­ల­కు సా­ధ్యం కానీ రి­కా­ర్డ్ అం­దు­కు­న్నా­డు. అం­తే­కా­కుం­డా గత 40 ఏళ్ల­లో టె­స్ట్ క్రి­కె­ట్‌­లో ఐదు రో­జు­లూ బ్యా­టిం­గ్ చే­సిన తొలి భారత ఆట­గా­డి­గా కూడా పు­జా­రా చరి­త్ర­కె­క్కా­డు. సౌ­తా­ఫ్రి­కా, ఇం­గ్లం­డ్, న్యూ­జి­లాం­డ్, ఆస్ట్రే­లి­యా(సెనా) దే­శా­ల­పై అత్య­ధిక టె­స్ట్ మ్యా­చ్‌­ల­ను గె­లి­చిన భారత ఆట­గా­డి­గా కూడా పు­జా­రా ఘన­త­ను అం­దు­కు­న్నా­డు. బో­ర్డ­ర్ గవా­స్క­ర్ సి­రీ­స్‌­లో పు­జా­రా మా­త్ర­మే 1258 బం­తు­లు ఎదు­ర్కొ­న్నా­డు. ఇప్ప­టి­కే వి­రా­ట్ కో­హ్లీ, రో­హి­త్ శర్మ, రవి­చం­ద్ర­న్ అశ్వి­న్‌­లు టె­స్ట్ క్రి­కె­ట్‌­కు రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చ­గా.. పు­జా­రా కూడా ఈ జా­బి­తా­లో చే­రా­డు. అజిం­క్యా రహా­నే ఒక్క­డే మి­గి­లా­డు. అతను కూడా తప్పు­కుం­టే టె­స్ట్‌­ల్లో ఓ శకం ము­గు­స్తోం­ది. భారత టె­స్టు క్రి­కె­ట్‌­లో మూడు తరం ప్లే­య­ర్లు 'వా­ల్‌­'­గా గు­ర్తిం­చా­రు. గా­వ­స్క­ర్, ద్ర­వి­డ్ తర్వాత, ఇప్పు­డు పు­జా­రా మూడో స్థా­నం­లో 'నయా వా­ల్‌­'­గా ని­లి­చా­డు. 100 కంటే ఎక్కువ టె­స్టు­ల్లో భారత­కు వె­న్నె­ము­క­గా పని­చే­శా­డు.

మూడో ప్లేయర్‌గా

103 టె­స్టు­ల్లో 7,000+ పరు­గు­లు సా­ధిం­చి, ఐదు రో­జు­లూ బ్యా­టిం­గ్ చే­సిన మూడో భారత ప్లే­య­ర్‌­గా ని­లి­చా­డు. 2017లో ఈడె­న్ గా­ర్డె­న్స్‌ వే­ది­క­గా శ్రీ­లం­క­తో మ్యా­చ్‌­లో ఈ ఫీట్ సా­ధిం­చా­డు. ఆరు మ్యా­న్ ఆఫ్ ది మ్యా­చ్, రెం­డు ప్లే­య­ర్ ఆఫ్ ది సి­రీ­స్ అవా­ర్డు­లు గె­లి­చా­డు. 2023 ప్ర­పంచ టె­స్టు ఛాం­పి­య­న్‌­షి­ప్ ఫై­న­ల్ తర్వాత జట్టు­కు దూ­ర­మ­య్యా­డు, కానీ 'మూ­డో' స్థా­నం భర్తీ ఇప్ప­టి­కీ కొ­న­సా­గు­తుం­ది. చతే­శ్వ­ర్ పు­జా­రా 'నయా వా­ల్‌­'­గా తన స్థా­నా­న్ని బలం­గా కొ­న­సా­గిం­చా­డు. కొ­త్త తరం­పై దృ­ష్టి పె­ట్టి­నా, అతడి స్థా­నా­న్ని భర్తీ చే­య­డా­ని­కి ఎదు­రు ఆట­గా­డు ఎవరు అవు­తా­రో చూ­డా­ల్సి ఉంది. టె­స్ట్ క్రి­కె­ట్‌­లో పు­జా­రా ఆరు­సా­ర్లు ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్ అవా­ర్డ్‌­ను, రెం­డు సా­ర్లు ప్లే­య­ర్ ఆఫ్ ది సి­రీ­స్ అవా­ర్డ్స్‌­ను గె­లు­చు­కు­న్నా­డు. 2006లో జరి­గిన అం­డ­ర్ 19 ప్ర­పం­చ­క­ప్‌­లో­నూ పు­జా­రా ప్లే­య­ర్ ఆఫ్ ది సి­రీ­స్‌ అవా­ర్డు అం­దు­కు­న్నా­డు. 2013లో ఐసీ­సీ ఎమ­ర్జిం­గ్ ప్లే­య­ర్ ఆఫ్ ది ఇయర్ అవా­ర్డ్, 2018లో బో­ర్డ­ర్ గవా­స్క­ర్ ట్రో­ఫీ­లో ప్లే­య­ర్ ఆఫ్ ది సి­రీ­స్‌­గా ని­లి­చా­డు. ఒక టె­స్ట్ ఇన్నిం­గ్స్‌­ల్లో 500 బం­తు­లు ఎదు­ర్కొ­న్న ఏకైక ఆట­గా­డి­గా కూడా పు­జా­రా చరి­త్ర సృ­ష్టిం­చా­డు.

Tags

Next Story